రైతుల అభ్యున్నతికి కృషి
రైతుల అభ్యున్నతికి కృషి
Published Sat, Dec 10 2016 10:53 PM | Last Updated on Fri, Aug 30 2019 8:37 PM
- రాష్ట్ర సహకార శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి
కర్నూలు(అగ్రికల్చర్): రైతుల సంక్షేమానికి మరింత కృషి చేయాలని రాష్ట్ర సహకార, అటవీ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సూచించారు. శనివారం అనంతపురం వెలుతూ... కర్నూలు జిల్లా సహకార కేంద్రబ్యాంకుకు వచ్చారు. మంత్రికి కేడీసీసీబీ చైర్మన్ మల్లికార్జునరెడ్డి, డీసీఓ సబ్బారావు తదితరులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి బ్యాంకు స్థితిగతులను సమీక్షించారు. కాగా డీసీసీబీ చైర్మన్ మాట్లాడుతూ...జిల్లా సహకార కేంద్రబ్యాంకుల్లో రద్దు అయిన రూ.500, 1000 నోట్లను డిపాజిట్లుగా తీసుకోవడాన్ని ఆర్‌బీఐ నిషేధించినందున రికవరీలు పడిపోతున్నాయని తెలిపారు. అన్ని వాణిజ్య బ్యాంకుల తరహాలోనే సహకార బ్యాంకుల్లోను 500, 1000 నోట్లు డిపాజిట్లుగా తీసుకునేందుకు అనుమతి ఇచ్చే విధంగా ఆర్‌బీఐపై ప్రభుత్వం ద్వారా ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. మంత్రి స్పందిస్తూ ఆర్‌బీఐ నిర్ణయంతో సహకార బ్యాంకులు, రైతులు ఇబ్బందులు పడుతున్నది నిజమేనని .. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్తానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహకార కేంద్రబ్యాంకు మాజీ చైర్మన్ కాతా అంకిరెడ్డి, డీజీఏంలు ఉమామహేశ్వరరెడ్డి, సునీల్‌కుమార్, మేనేజర్‌లు త్రినాథ్ రెడ్డి, రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.
Advertisement