రైతుల సంక్షేమానికి కృషి
రైతుల సంక్షేమానికి కృషి
Published Wed, Dec 28 2016 11:04 PM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
– అగ్రికల్చర్ రీసెర్చ్ సర్వీస్ టాపర్ మనోగతం
– ఏఈఓ నుంచి శాస్త్రవేత్త స్థాయికి ఎదిగిన రాఘవేంద్రగౌడు
కర్నూలు(అగ్రికల్చర్): వ్యవసాయశాఖలో వ్యవసాయ విస్తరణాధికారిగా పనిచేసిన రాఘవేంద్రగౌడు నిరంతర శ్రమతో లక్ష్యాన్ని సాధించాడు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన ఆయన వ్యవసాయ శాస్త్రవేత్త అయి రైతులకు సేవలు అందించాలనే పట్టుదల ఎట్టకేలకు సిద్ధించింది . అగ్రికల్చర్ రీసెర్చ్ సర్వీస్‌లో జాతీయ స్థాయిలో టాపర్‌గా నిలిచి అగ్రానమీ శాస్త్రవేత్తగా ఎంపిక అయ్యారు. కర్నూలు బళ్లారి చౌరస్తా ప్రాంతానికి చెందిన ఆయన కర్నూలు మండలంలో వ్యవసాయ విస్తరణ అధికారిగా పనిచేశారు. అయితే శాస్త్రవేత్త కావాలనే లక్ష్యంతో ఉద్యోగానికి రాజీనామా చేసి తిరుపతిలో కోచింగ్ తీసుకున్నారు. అగ్రికల్చర్ బీఎస్సీ, ఎమ్మెస్సీ పూర్తి చేశారు. ఎస్వీ యూనివర్సిటీలో అగ్రానమీలో పీహెచ్‌డీ చేశారు. అగ్రికల్చర్ రీసెన్చ్ సర్వీస్ నిర్వహించిన అగ్రానమీ విభాగంలో 2015లో ప్రిలిమ్స్, 2016లో మెయిన్ పరీక్ష రాశారు. ఈ పరీక్షలో రాఘవేంద్రగౌడు జాతీయ స్థాయిలో టాపర్‌గా నిలిచి అగ్రానమీ శాస్త్రవేత్త పోస్టుకు ఎంపికయ్యారు. మురళీగౌడు, లలితమ్మల కుమారుడైన రాఘవేంద్రగౌడు సాక్షితో మాట్లాడుతూ తల్లితండ్రుల ప్రోత్సాహంతో ఈ స్థాయికి వచ్చినట్లు తెలిపారు. అగ్రానమీ శాస్త్రవేత్తగా రైతులకు సేవలు అందించడమే ప్రధాన లక్ష్యమన్నారు. జాతీయ వరి పరిశోధన సంస్థ, జాతీయ పొగాకు పరిశోధన సంస్థ, మెట్ట వ్యవసాయ పరిశోధన సంస్థల్లో అగ్రానమీ శాస్త్రవేత్తగా పోస్టింగ్ ఇచ్చే అవకాశం ఉందని తెలిపారు.
Advertisement
Advertisement