పరిగి నియోజకవర్గ అభివృద్ధికి కృషి | Effort to develop Parigi constituency | Sakshi
Sakshi News home page

పరిగి నియోజకవర్గ అభివృద్ధికి కృషి

Published Sat, Jul 23 2016 6:09 PM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM

పరిగి నియోజకవర్గ అభివృద్ధికి కృషి - Sakshi

పరిగి నియోజకవర్గ అభివృద్ధికి కృషి

కుల్కచర్ల: పరిగి నియెజవర్గ అభివృద్ధికి కృషిచేస్తానని పరిగి ఎమ్మెల్యే టి. రామ్మోహన్‌రెడ్డి అన్నారు.శనివారం మండలంలోని ఎర్రగోవింద్‌తండాలో ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ  సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  నియోజకవర్గానికి రూ. 20 కోట్లు మంజూరు కావడం జరిగిందన్నారు. గిరిజన ,ఆశ్రమ పాఠశాల భవనాలు, కళాశాల భవనాలు,సీసీ రోడ్లకు నిధులు ఖర్చుచేయడం జరుగుతుందన్నారు. నియోజవర్గంలో ఎస్సీ,ఎస్టీ అవాస ప్రాంతాల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే నిధుల నుంచి మూడు కోట్లు, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ నుంచి ఏడు కోట్ల మంజూరు చేయించడం జరిగిందన్నారు. సమావేశంలో డీసీఎంఎస్‌ జిల్లా ఉపాధ్యక్షుడు భీంరెడ్డి, అసైన్‌మెంట్‌ కమిటీ సభ్యుడు భరత్‌కుమార్‌, మాజీ ఎంపీపీ అంజిలయ్యగౌడ్‌,కాంగ్రెస్‌ అధ్యక్షుడు  వెంకటయ్యగౌడ్‌, కనకం మొగులయ్య, విఠల్‌ నాయక్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement