MLA Rammohan reddy
-
తెలంగాణను హరితవనంగా తీర్చిదిద్దుదాం
మక్తల్: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకం గా చేపట్టిన హరితహారంలో అందరూ పాల్గొనడం ద్వారా రాష్ట్రాన్ని హరితవనంగా తీర్చిదిద్దాలని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డి అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్ మండలం మాద్వార్‌లోని శ్రీగట్టు తిమ్మప్ప దేవాలయం ప్రాంగణంలో సోమవారం ఆయన మొక్కలు నాటి హరితహారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మొక్క లు నాటి సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈ మేరకు ఆలయ కమిటీ బాధ్యులు ఎమ్మెల్యేతో పాటు సబ్‌కలెక్టర్ ఉపేందర్‌రెడ్డి, ఎంపీపీ గడ్డంపల్లి హన్మంతును సన్మానించారు. మార్కెట్ చైర్మన్ నర్సింహగౌడ్, ఎఫ్ఆర్వో నారాయణరావు, ఏపీడీ చంద్రశేఖర్, ఏపీఓ చిట్టెం మాధవరెడ్డి, ఎంపీడీఓ విజయనిర్మల, హెచ్ఎం రాందాస్, సర్పంచ్ రాధమ్మ, ఎంపీటీసీ రవిశంకర్‌రెడ్డి, టీఆర్ఎస్ అధ్యక్షుడు మహిపాల్‌రెడ్డితో పా టు రాజేశ్వర్‌రావు, సంతోష్‌రెడ్డి, రాంలింగం, ఈ శ్వర్, విశ్వనాథ్, ఆశప్ప, రాజమహేందర్‌రెడ్డి, నే తాజీరెడ్డి, శ్రీనివాసులు, కాషయ్య పాల్గొన్నారు. -
తల్లిపాలే పిల్లలకు శ్రేయస్కరం
♦ అంగన్వాడి కార్యకర్తలకు దీర్ఘకాలిక లక్ష్యాలు అవసరం ♦ పూర్వప్రాథమిక విద్యా ఎంతో అవసరం ♦ తల్లిపాల మాసోత్సవాల్లో పరిగి ఎమ్మెల్యే టీ.రామ్మోహన్‌రెడ్డి పరిగి: పుట్టగానే ముర్రుపాలతో పాటు తదనంతరం తల్లిపాలు తాగించటం వల్ల దీర్ఢకాలంలో వారి ఎదుగుదలకు దోహదం చేస్తాయని ఎమ్మెల్యే టీ. రామ్మోహన్‌రెడ్డి అన్నారు. గురువారం పరిగిలోని కేఎన్ఆర్ గార్డెన్లో ఐసీడీఎస్ ఆద్వర్యంలో తల్లిపాల మాసోత్సవాల్లో బాగంగా నియోజకవర్గ స్థాయి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ అంగన్వాడి కేంద్రాలు స్వల్పకాలిక లక్ష్యాలను సాధిస్తూనే దీర్ఘకాలిక లక్ష్యాలకోసం పనిచేయాలన్నారు. పూర్వ ప్రాథమిక విద్య ప్రభుత్వం ప్రవేశపెట్టాలని అయితే అది అంగన్వాడి సెంటర్ల ద్వారానే అమలు జరగాల్సిన అవసరం ఉందన్నారు. ఇదే సమయంలో పూర్వ ప్రాథమిక విద్య పాఠశాలలకు అనుబందంగా జరగాలన్నారు. అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు. మాతా శిశు మరణాలను తగ్గించటంలో అంగన్వాడీల పాత్ర ఎంతో కీలకమైనదని ఆయన తెలిపారు. కార్యకర్తలకు నిరంతరం శిక్షణ తోపాటు వారిలో వత్తిడిని తగ్గించేందుకు నిరంతరం ప్రత్యేక కార్యక్రమాలు అవసరమని అధికారులకు సూచించారు. అంగన్వాడి కార్యకర్తల సమస్యలు, పోస్టుల భర్తి తదితర అంశాలు అసెంబ్లీలో చర్చిస్తానని తెలిపారు. అనంతరం పరిగి జ్యోతి, గండేడ్ ఎంపీపీ శాంత మాట్లాడుతూ సమాజాం అంగన్వాడీలను సరియైన విదంగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రసవం తల్లికి పునర్జన్మ అని అలాంటి తల్లులను కాపాడుకోవాల్సిన బాధ్యత మన వ్యవస్థపై ఉందని పరిగి సర్పంచ్ విజయమాల అన్నారు. అంగన్వాడీ కేంద్రాలు, హెల్త్ సబ్ సెంటర్లను పూర్తి స్థాయిలో వినియోగించుకుంటే గ్రామ స్థాయిలోనే చాలా రకాల హెల్త్ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఎంపీడీఓ విజయప్ప, ఎస్పీ హెచ్ఓ డాక్టర్ ధశరథ్ అన్నారు. దీర్ఘకాలిక ప్రయోజనాలతో అంగన్వాడి కేంద్రాలు పనిచేస్తున్నాయని సీడీపీఓ ప్రియదర్శిని అన్నారు. తల్లిపాలు పిల్లల పాలిట సంజీవిని అని వివరించారు. చిన్నతనంలో తల్లిపాలు తాగిన చిన్నారుల్లో రోగనిరోధక శక్తి అధికంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి సూపర్వైజర్లు సరళ, ఆదిలక్ష్మి, ప్రమిళ, రాణి, నిర్మళ, దివ్య, నీలవేణి, పద్మ, జ్యోతి, కాంగ్రెస్ నాయకులు టీ. వెంకటేష్, అశోక్‌రెడ్డి అంగన్వాడి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆకట్టుకున్న స్టాళ్లు. అంగన్వాడి కార్యకర్తలు ఊర్పాటు చేసిన స్టాళ్లు ఆకట్టుకున్నాయి. ఇందులో బాగంగా అంగన్వాడి కార్యకర్తలు చిన్నారులకు చిన్నతనంలో ఆటల కోసం, సృజనాత్మకతను పెంచేందుకు వినియోగించే పరికరాలు, వస్తులు అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లలో ప్రదర్శించారు. తీసుకోవాల్సిన ఆహార పధార్థాల తయారు చేసి స్టాళ్లలో ఉంచారు వాటివల్ల కలిగే ఉపయోగాలను అక్కడ రాసి ఉంచారు. ఆరోగ్యం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబందించిన పరికరాలు ప్రదర్శించారు. -
పరిగిని ముందువరుసలో నిలబెడతా
♦ ‘పాలమూరు ఎత్తిపోతల’ తీసుకువస్తా ♦ పరిగిని ముందువరుసలో నిలబెడతా ♦ ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి పరిగి: అభివృద్ధిలో పరిగిని జిల్లాలోనే ముందు వరుసలో నిలబెట్టేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని మల్లెమోనిగూడలో రూ. 5 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డు పనులకు ఆయన స్థానిక సర్పంచ్ విజయమాల, ఎంపీటీసీ సభ్యుడు సమద్, ఎంపీడీఓ విజయప్ప, పీఆర్ డీఈఈ అంజయ్యతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆ గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామ సభలో ఆయన ప్రసంగించారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా పాలమూరు ఎత్తి పోతల పథకాన్ని పరిగి నియోజకవర్గానికి తీసుకువచ్చి తీరుతామన్నారు. ఇందుకోసం ప్రభుత్వంతో ఎన్ని పోరాటాలకైనా సిద్ధమన్నారు. మల్లెమోనిగూడ గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని తెలిపారు. గ్రామస్తులకు సురక్షిత నీరు అందించేందుకు మినరల్ వాటర్ ప్లాంటు ఏర్పాటుకు నిధులు మంజూరు చేస్తానని తెలిపారు. అయితే ఈ క్రమంలో నాయకుడు అశ్రఫ్ మాట్లాడుతూ ..అర్బన్ ప్రాంతాలకు దూరంగా ఉన్న అనుబంధ గ్రామాలకు సైతం పరిగి లాంటి పట్టణాలకు సమానంగా పన్నులు విధిస్తున్నారని తెలుపగా..ఈ విషయమై ఎమ్మెల్యే అసెంబ్లీలో చర్చిస్తానని తెలిపారు. అనంతరం సర్పంచ్ విజయమాల మాట్లాడుతూ ..మల్లెమోనిగూడ గ్రామాభివృద్ధికోసం పంచాయతీ నుంచి నిధులు కేటాయిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఏఈలు బాలచందర్, రమ్య, పంచాయతీ ఈఓ కృష్ణ, డీసీసీ ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, కాంగ్రెస్ నాయకులు నారాయణరెడ్డి, సుభాష్‌చందర్‌రెడ్డి, అశ్రఫ్, రవీంద్ర, ఎర్రగడ్డపల్లి కృష్ణ, టి. వెంకటేష్, సత్యంపేట్, బండలింటి మైపాల్, పరశురాంరెడ్డి, గోపాల్, అక్బర్, ఆనెం ఆంజనేయులు, ఎదిరే కృష్ణ, సర్వర్, నందు, నయీమోద్దీన్, శివకుమార్, షాహెద్, పాల్గొన్నారు. -
పరిగి నియోజకవర్గ అభివృద్ధికి కృషి
కుల్కచర్ల: పరిగి నియెజవర్గ అభివృద్ధికి కృషిచేస్తానని పరిగి ఎమ్మెల్యే టి. రామ్మోహన్‌రెడ్డి అన్నారు.శనివారం మండలంలోని ఎర్రగోవింద్‌తండాలో ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గానికి రూ. 20 కోట్లు మంజూరు కావడం జరిగిందన్నారు. గిరిజన ,ఆశ్రమ పాఠశాల భవనాలు, కళాశాల భవనాలు,సీసీ రోడ్లకు నిధులు ఖర్చుచేయడం జరుగుతుందన్నారు. నియోజవర్గంలో ఎస్సీ,ఎస్టీ అవాస ప్రాంతాల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే నిధుల నుంచి మూడు కోట్లు, ఎన్ఆర్ఈజీఎస్ నుంచి ఏడు కోట్ల మంజూరు చేయించడం జరిగిందన్నారు. సమావేశంలో డీసీఎంఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు భీంరెడ్డి, అసైన్మెంట్ కమిటీ సభ్యుడు భరత్‌కుమార్, మాజీ ఎంపీపీ అంజిలయ్యగౌడ్,కాంగ్రెస్ అధ్యక్షుడు వెంకటయ్యగౌడ్, కనకం మొగులయ్య, విఠల్ నాయక్ పాల్గొన్నారు.