మేం బతికే ఉన్నాం..
లైవ్ సర్టిఫికెట్ కోసం పింఛన్‌దారుల పాట్లు
ఇందూరు : రాష్ట్ర ప్రభుత్వం పట్టణ ప్రాంతాల పెన్షన్‌దారులకు విధించిన కొత్త నిబంధనతో వృద్ధులు, వికలాంగులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. పెన్షన్ లబ్ధిదారులు తాము బతికి ఉన్నామని నిరూపించుకోవడానికి ప్రతి ఆరు నెలలకు ఒకసారి మీ సేవ కేంద్రాలలో వేలి ముద్రలు పోల్చి చూసుకుని ‘లైవ్ ఎవిడెన్స్ సర్టిఫికెట్’ ఇవ్వాలని ప్రభుత్వం సూచించింది. ఈనెల 21 వ తేదీలోగా ‘లైవ్ ఎవిడెన్స్ సర్టిఫికెట్’ సమర్పించాలని పేర్కొంది. దీంతో నిజామాబాద్‌లోని పెన్షన్ లబ్ధిదారులు నగరంలోని మీసేవ కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. అందరూ ఒకేసారి రావడంతో గంటల తరబడి వరుసల్లో నిల్చోవాల్సి వస్తోంది. బుధవారం సర్వర్ సతాయించడంతో మరింత ఎక్కువ సమయం వేచి చూడాల్సి వచ్చింది.