విద్యుత్ చౌర్యానికి పాల్పడిన నలుగురి అరెస్ట్
Published Thu, Aug 11 2016 12:14 AM | Last Updated on Wed, Sep 5 2018 1:46 PM
హన్మకొండ : విద్యుత్ చౌర్యానికి పాల్పడిన నలుగురిని అరెస్టు చేసినట్లు ఎన్పీడీసీఎల్ ఏపీటీఎస్ ఇన్‌స్పెక్టర్ డాక్టర్ ఎం.జితేందర్‌రెడ్డి తెలిపారు. వరంగల్ రామన్నపేటకు చెందిన జన్ను సాంబయ్య, నమిండ్ల సుధాకర్, గీసుకొండకు చెందిన పులిచేరు సుధాకర్, తొర్రూరు మండలం కర్కాలకు చెందిన సెగ్గం సతీష్ విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్నం దున అరెస్టు చేసినట్లు వివరించారు. ఈ నలుగురు విద్యుత్ క¯ð క్షన్ తీసుకోకుండా విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్నారని ఆయనతెలిపారు. గతంలో కూడా విద్యుత్ చౌర్యానికి పాల్పడగా జరిమాన కట్టించి హెచ్చరించి వదిలేశామన్నారు. మరోసారి విద్యుత్ చౌర్యానికి పాల్పడడంతో జన్ను సాం బయ్య, నమిండ్ల సుధాకర్, పులిచేరి సుధాకర్, సెగ్గం సతీష్‌లను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరుచగా రిమాండ్‌కు పంపినట్లు వివరించారు. ఎస్సైలు జె.విద్యాసాగర్‌ఱెడ్డి, వి.శంకర్, హెడ్‌కానిస్టేబుళ్లు కె.కళాధర్‌రాజు, జి.సుధాకర్, సిబ్బంది మురళీమోహన్, అశోక్ విజిలెన్స్ దాడుల్లో పాల్గొన్నారు.
Advertisement
Advertisement