బాలికల విద్యను ప్రోత్సహించాలి
– రవీంద్ర మహిళా డిగ్రీ కళాశాల ఫ్రెషర్స్ వేడుకల్లో ఎంపీ బుట్టారేణుక పిలుపు
– ఆకట్టుకున్న సాంస్కతిక కార్యక్రమాలు
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): తల్లిదండ్రులు బాలికలపై వివక్ష చూపకుండా వారు చదువుకునేలా ప్రోత్సహిస్తే దేశం సర్వతోముఖాభివద్ధి చెందుతుందని ఎంపీ బుట్టా రేణుక పేర్కొన్నారు. కొడుకులతో సమానంగా కూతుళ్లకు విద్య, ఇతర అవకాశాలు కల్పించాలని కోరారు. శనివారం రవీంద్ర మహిళా డిగ్రీ కళాశాల ఫ్రెషర్స్ డే వేడుకలు గుత్తి పెట్రోల్ బంకు సమీపంలోని లక్ష్మీ కల్యాణ మండపంలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ఎంపీబుట్టా రేణుక, రవీంద్ర విద్యాసంస్థల అధినేత జి.పుల్లయ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ..క్రమశిక్షణతో విద్యను అభ్యసించి తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. అలాగే అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మనసులోని భయాన్ని తొలగిస్తే విజయం మనసొంతమవుతుందన్నారు. మార్కులు, ర్యాంకుల కోసం కాకుండా వ్యక్తిగత నైపుణ్యాలను పెంపొందించుకోవడంపై దష్టి సారించాలన్నారు. డిగ్రీ విద్య జీవితంలో ఎంతో విలువైనదని, సద్వినియోగం చేసుకుంటే ఉన్నత స్థానంలో స్థిరపడతారని రవీంద్ర విద్యా సంస్థల అధినేత జి.పుల్లయ్య విద్యార్థులకు సూచించారు. అనంతరం విద్యార్థినుల నత్యాలు, నాటికలు చూపరులను అలరించాయి. కార్యక్రమంలో కళాశాల చైర్మన్ మోహన్‌కుమార్, ప్రిన్సిపాల్ మమత, వైస్ ప్రిన్సిపాల్ జ్యోతి పాల్గొన్నారు.