freshersday
-
లఖోటియా : ఫ్రెషర్స్ హుషార్
-
కలర్ఫుల్గా రిశాలీ ఇన్స్టిట్యూట్ ఫ్రెషర్స్ డే
-
రవీంద్ర మహిళా డిగ్రీ కళాశాల ఫ్రెషర్స్ డే వేడుకలు
-
బాలికల విద్యను ప్రోత్సహించాలి
– రవీంద్ర మహిళా డిగ్రీ కళాశాల ఫ్రెషర్స్ వేడుకల్లో ఎంపీ బుట్టారేణుక పిలుపు – ఆకట్టుకున్న సాంస్కతిక కార్యక్రమాలు కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): తల్లిదండ్రులు బాలికలపై వివక్ష చూపకుండా వారు చదువుకునేలా ప్రోత్సహిస్తే దేశం సర్వతోముఖాభివద్ధి చెందుతుందని ఎంపీ బుట్టా రేణుక పేర్కొన్నారు. కొడుకులతో సమానంగా కూతుళ్లకు విద్య, ఇతర అవకాశాలు కల్పించాలని కోరారు. శనివారం రవీంద్ర మహిళా డిగ్రీ కళాశాల ఫ్రెషర్స్ డే వేడుకలు గుత్తి పెట్రోల్ బంకు సమీపంలోని లక్ష్మీ కల్యాణ మండపంలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ఎంపీబుట్టా రేణుక, రవీంద్ర విద్యాసంస్థల అధినేత జి.పుల్లయ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ..క్రమశిక్షణతో విద్యను అభ్యసించి తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. అలాగే అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మనసులోని భయాన్ని తొలగిస్తే విజయం మనసొంతమవుతుందన్నారు. మార్కులు, ర్యాంకుల కోసం కాకుండా వ్యక్తిగత నైపుణ్యాలను పెంపొందించుకోవడంపై దష్టి సారించాలన్నారు. డిగ్రీ విద్య జీవితంలో ఎంతో విలువైనదని, సద్వినియోగం చేసుకుంటే ఉన్నత స్థానంలో స్థిరపడతారని రవీంద్ర విద్యా సంస్థల అధినేత జి.పుల్లయ్య విద్యార్థులకు సూచించారు. అనంతరం విద్యార్థినుల నత్యాలు, నాటికలు చూపరులను అలరించాయి. కార్యక్రమంలో కళాశాల చైర్మన్ మోహన్‌కుమార్, ప్రిన్సిపాల్ మమత, వైస్ ప్రిన్సిపాల్ జ్యోతి పాల్గొన్నారు. -
‘ఫ్రెష్’లుక్..!
బీచ్‌రోడ్ : నయా ఫ్యాషన్స్..న్యూ డ్రెస్ స్టైల్..లంగా ఓణీలతో అమ్మాయిలు అదరగొట్టారు. ర్యాంప్‌పై హŸయలొలికించారు. అందమైన భామలంతా ఒకే చోట చేరి సందడిచేశారు. మేమేం తక్కువ కాదంటూ హ్యాండ్సమ్ గయ్స్ కేక పుట్టించారు. డ్యాన్స్‌లు, స్కిట్స్‌తో అలరించారు. ఇంటర్నేషనల్ హోటల్ మేనేజ్మెంట్ అకాడమీ ఫ్రెషర్స్ డేను ఆర్కేబీచ్‌లోని ఓ హోటల్లో సోమవారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, నగర సంయుక్త పోలీస్ కమిషనర్ ఏఎస్ ఖాన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలన్నారు. ముఖ్యంగా రాజకీయ రంగంలోకి రావాలని పిలుపునిచ్చారు. అతిథులు వారి అనుభవాలను విద్యార్థులతో షేర్ చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ భానుకుమార్, చంద్రప్రసాద్, రవికుమార్, ఆర్జే వీరుమామ, సంస్థ సీఎండీ సతీష్ పొన్నం, ఈడీ స్వప్న పొన్నం, వైస్ ప్రిన్సిపాల్ కిషోర్ రెడ్డి హాజరయ్యారు. -
‘అక్షర’లో ఘనంగా ఫ్రెషర్స్‌డే
చిలుకూరు: మండల పరిధిలోని అక్షరా పాలిటెక్నిక్ , వైష్ణవి డీఎడ్ కళాశాలలో బుధవారం ఘనంగా ప్రెషర్స్‌డే కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన డ్యాన్స్‌లు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో చైర్మన్ కైలాసపు రామానాథం, వైస్ చైర్మన్ గంగిరెడ్డి కృష్ణారెడ్డి, సెక్రెటరీ బండి అనిల్‌కుమార్‌రెడ్డి, కరస్పాండెంట్ బూర లక్ష్మీనారాయణ, ప్రిన్సిపాళ్లు గంగిరెడ్డి రమేష్‌రెడ్డి, గంగిరెడ్డి వీరారెడ్డి, డైరక్టర్ డాక్టర్ గౌస్‌పాషా, పర్యావరణ ఉద్యమకారుడు కొల్లు లక్ష్మీనారాయణ, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
స్నేహితుడా.....
ఏయూక్యాంపస్: విద్యార్థులు ఆడి పాడారు, సీనియర్, జూనియర్ విద్యార్థులు కలిసి ఎంజాయ్ చేశారు. ఆంధ్రవిశ్వవిద్యాలయం వృక్షశాస్త్ర విభాగంలో నిర్వహించిన ఫ్రెషర్స్ డే వేడుకలు హుషారుగా సాగాయి. నృత్యాలు, గీతాలు, క్యాట్‌వాక్‌లు, బంద నత్యాలతో ఆనందాన్ని పంచారు. సీనియర్, జూరియన్ విద్యార్థులు ఎటువంటి బేధాలు లేకుండా ఆనందంగా ఆడిపాడి సందడి చేశారు. పాశ్యాత్య, సాంప్రదాయ నృత్యాల అనుగుణంగా విద్యార్థులు నర్తించారు.