‘ఫ్రెష్‌’లుక్‌..! | fresh look | Sakshi
Sakshi News home page

‘ఫ్రెష్‌’లుక్‌..!

Published Mon, Aug 22 2016 11:43 PM | Last Updated on Mon, Sep 4 2017 10:24 AM

‘ఫ్రెష్‌’లుక్‌..!

‘ఫ్రెష్‌’లుక్‌..!

బీచ్‌రోడ్‌ : నయా ఫ్యాషన్స్‌..న్యూ డ్రెస్‌ స్టైల్‌..లంగా ఓణీలతో అమ్మాయిలు అదరగొట్టారు. ర్యాంప్‌పై హŸయలొలికించారు. అందమైన భామలంతా ఒకే చోట చేరి సందడిచేశారు. మేమేం తక్కువ కాదంటూ హ్యాండ్సమ్‌ గయ్స్‌ కేక పుట్టించారు. డ్యాన్స్‌లు, స్కిట్స్‌తో అలరించారు. ఇంటర్నేషనల్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ అకాడమీ ఫ్రెషర్స్‌ డేను ఆర్కేబీచ్‌లోని ఓ హోటల్‌లో సోమవారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, నగర సంయుక్త పోలీస్‌ కమిషనర్‌ ఏఎస్‌ ఖాన్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలన్నారు. ముఖ్యంగా రాజకీయ రంగంలోకి రావాలని పిలుపునిచ్చారు.  అతిథులు వారి అనుభవాలను విద్యార్థులతో షేర్‌ చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్‌ భానుకుమార్, చంద్రప్రసాద్, రవికుమార్, ఆర్‌జే వీరుమామ, సంస్థ సీఎండీ సతీష్‌ పొన్నం, ఈడీ స్వప్న పొన్నం, వైస్‌ ప్రిన్సిపాల్‌ కిషోర్‌ రెడ్డి హాజరయ్యారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement