rampwalk
-
గ్యాప్ కాదు.. ప్రిపరేషన్..
ఫ్యాషన్ షోలో దేవకీనందన వాసుదేవ ఫేమ్ నటి, మాజీ మిస్ ఇండియా మానస వారణాసి ర్యాంప్ వాక్‌తో అదరగొట్టిన మోడల్స్తెలుగు సినిమా ఇండస్ట్రీ సొంత ఇల్లు. నా మనసు ఎప్పుడూ ఇంట్లోనే ఉంటుందని దేవకీనందన వాసుదేవ ఫేమ్, మాజీ మిస్ ఇండియా మానస వారణాసి పేర్కొన్నారు. బంజారాహిల్స్‌లోని పార్క్‌హయత్ హోటల్లో నిర్వహించిన ఓ ఫ్యాషన్ షోలో పాల్గొన్న ఆమె సాక్షితో ముచ్చటించారు. 2020లో మిస్ ఇండియాగా ఎంపికయ్యాను. 2024లో తెలుగు సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చా. ఈ మధ్య కాలంలో చాలా గ్యాప్ తీసుకున్నారని పలువురు అంటున్నారు.. అయితే ఇది గ్యాప్ కాదు.. నాకు ప్రిపరేషన్‌లా అనిపిస్తోంది. ముంబై నుంచి తిరిగి హైదరాబాద్ చేరుకోవడం చాలా సంతోషంగా ఉంది. నా ప్యాషన్ ఎప్పుడూ సినిమాపైనే. మొన్ననే దేవకీనందన వాసుదేవ రిలీజ్ అయ్యింది. చేతిలో కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి. వివిధ రకాల థీమ్స్ వస్త్రాలతో మోడల్స్ ర్యాంప్ వాక్ చేశారు. డిజైనర్ అర్జెంటుమ్ ఆర్ట్స్ రాజ్ దీప్ రణవ్ తీర్చిదిద్దిన డిజైనర్ దుస్తులను మోడల్స్ ర్యాంపుపై ప్రదర్శించారు. ప్రదర్శనలో భాగంగా డిజైనర్లు లక్ష్మీ రెడ్డి, వస్త్రలేఖ, మంగళగౌరి, ఆదరణ, విశిష్ట గోల్డ్ అండ్ డైమండ్స్, యక్షి దీప్తి రెడ్డి, అంజలీ, అర్జున్ కపూర్ ప్రముఖ డిజైనర్స్‌కు చెందిన కలెక్షన్లు, ప్రముఖ సినీ తారలు మానస వారణాసి, సీరత్ కపూర్, ప్రజ్ఞ అయ్యగారి, మాళవిక మోహన్, నేహా శెట్టి షో టాపర్స్‌గా మెరిశారు. ఈ మోడల్ షోలో 16 మంది డిజైనర్లు రూపొందించిన సరి కొత్త డిజైన్లను రెండు రోజుల పాటు ప్రదర్శించనున్నారు. హైదరాబాద్‌తో పాటు ముంబై, ఢిల్లీ ప్రాంతాలకు చెందిన మోడల్స్ ర్యాంపుపై సందడి చేశారు. -
ఇండియన్, వెస్ట్రన్ లుక్స్‌తో సందడి చేసిన మోడల్స్! (ఫొటోలు)
-
చాక్లెట్ డ్రెస్సుల్లో అందాల ముద్దుగుమ్మలు
-
ర్యాంప్‌పై మెరిసే..
-
డైమండ్ ధగధగల సౌందర్య సోయగం
-
హీరోయిన్ సంజనా ర్యాంప్ వాక్
-
ర్యాంప్‌వాక్.. అదరహో
-
‘ఫ్రెష్’లుక్..!
బీచ్‌రోడ్ : నయా ఫ్యాషన్స్..న్యూ డ్రెస్ స్టైల్..లంగా ఓణీలతో అమ్మాయిలు అదరగొట్టారు. ర్యాంప్‌పై హŸయలొలికించారు. అందమైన భామలంతా ఒకే చోట చేరి సందడిచేశారు. మేమేం తక్కువ కాదంటూ హ్యాండ్సమ్ గయ్స్ కేక పుట్టించారు. డ్యాన్స్‌లు, స్కిట్స్‌తో అలరించారు. ఇంటర్నేషనల్ హోటల్ మేనేజ్మెంట్ అకాడమీ ఫ్రెషర్స్ డేను ఆర్కేబీచ్‌లోని ఓ హోటల్లో సోమవారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, నగర సంయుక్త పోలీస్ కమిషనర్ ఏఎస్ ఖాన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలన్నారు. ముఖ్యంగా రాజకీయ రంగంలోకి రావాలని పిలుపునిచ్చారు. అతిథులు వారి అనుభవాలను విద్యార్థులతో షేర్ చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ భానుకుమార్, చంద్రప్రసాద్, రవికుమార్, ఆర్జే వీరుమామ, సంస్థ సీఎండీ సతీష్ పొన్నం, ఈడీ స్వప్న పొన్నం, వైస్ ప్రిన్సిపాల్ కిషోర్ రెడ్డి హాజరయ్యారు.