ఈఎన్‌టీ వైద్యులకు శిక్షణ ఇస్తున్న డాక్టర్ జయప్రకాష్‌రెడ్డి
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు నగరంలోని ఎన్‌ఆర్ పేటలో ఉన్న శ్రీ సత్యసాయి ఈఎన్‌టీ హాస్పిటల్‌లో రెండురోజులుగా కొనసాగుతున్న ఈఎన్‌టీ శస్త్రచికిత్స శిబిరం(టెంపోరల్ బోన్ డిసెక్షన్, ఆసిక్యులోప్లాస్టి, మైక్రో ఇయర్) ఆదివారం ముగిసింది. ఈ సందర్భంగా ఈఎన్‌టీ వైద్యులు డాక్టర్ బి. జయప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ చెవి వినికిడి లోపం ఉన్న వారిలో వినికిడి పెంచడానికి చేసే క్లిష్టమైన ఆపిక్యులోప్లాస్టీ అనే శస్త్రచికిత్సపై శిక్షణ ఇచ్చామన్నారు. ఈ వర్క్‌షాప్‌లో ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఢిల్లీ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిస్సా, కర్ణాటక, కేరళ, తెలంగాణా రాష్ట్రాల నుంచి 25 మంది ప్రతినిధులు హాజరై శిక్షణ పొందారని తెలిపారు. తనతోపాటు డాక్టర్ నదీమ్, గోవిందరాజు, డాక్టర్ కుమారస్వామి(బెంగళూరు), డాక్టర్ అమతపీతి(తిరుపతి), డాక్టర్ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి(రామమండ్రి), డాక్టర్ మహేంద్రకుమార్(కర్నూలు) శిక్షణ ఇచ్చినట్లు వివరించారు.