దత్తత ఎర్రవల్లికి ఏడాది
-ఆదర్శ(అదృష్ట) గ్రామం
-సుమారు రూ.150 కోట్ల అభివృద్ధి
-హర్షం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు
జగదేవ్‌పూర్:మారుమూల పల్లెకు అదృష్టం పట్టుకుంది..ఒకేసారి చరిత్రకు ఎక్కింది. ఏ గ్రామమని ఆలోచిస్తున్నారా..అదేనండి మన సీఎం కేసీఆర్ దత్తత గ్రామం ఎర్రవల్లి. దత్తత తీసుకుని ఏడాది అవుతున్న సందర్భంగా గ్రామాభివృద్ధిపై ప్రత్యేక కథనం...
జగదేవ్‌పూర్ మండలంలో 23 గ్రామ పంచాయతీలు. 9 మదిర గ్రామాలున్నాయి. ఎర్రవల్లిలో ఎక్కువ శాతం వ్యవసాయమే జీవనధారం. మొత్తం జానాభా 1,445, ఓటర్లు 1,175, భూమి విస్తీర్ణం 22 వందల ఎకరాలు. సాగులో ఉంది 15 వందల ఎకరాలు. ప్రధాన పంటలు పత్తి, మొక్కజొన్న, పంటలను సాగు చేస్తారు.
మండల కేంద్రానికి 8 కిలో మీటర్ల దూరంలో ఉన్నా అభివృద్ధి అంతంత మాత్రమే. ఇప్పుడు ఒకేసారి రూపురేఖలు మారిపోయాయి. సీఎం అడుగుపెట్టింది మొదలు అభివృద్ధి శరవేగంగా జరుగుతోంది. నిధుల వర్షం. అభివృద్ధి పనులు జోరు. రాష్ట్రంలోనే నంబర్‌వన్ గ్రామంగా రూపుదిద్దుకుంటోంది. సుమారు రూ 150 కోట్ల నిధులు వెచ్చిస్తున్నారు.
ఇలా కలిసొచ్చింది...
సీఎం కేసీఆర్ ఎర్రవల్లి గ్రామ సమీపంలో వ్యవసాయక్షేత్రాన్ని నిర్మించకున్నారు. ఫాంహౌస్‌కు ఎర్రవల్లి దారి నుంచే రాకపోకలు సాగించారు. సీఎం ఫాంహౌస్‌కు వస్తూ.. పోతుంటే ఎర్రవల్లి గ్రామ సర్పంచ్, ప్రజలు నమస్కారాలు పెట్టేవారు. ఇదే క్రమంలో గ్రామజ్యోతి కార్యక్రమం ప్రవేశపెట్టారు. గత ఏడాది ఆగస్టు19న సీఎం కేసీఆర్ ఎర్రవల్లి మీదుగా ఫాంహౌస్‌కు వెళుతున్నారు. ఆ సమయంలో గ్రామ సర్పంచ్ భాగ్యబాల్‌రాజు, ప్రజలు రోడ్డు పక్కన నిలబడ్డారు.
సీఎం రాగానే కాన్వాయ్ ఆపి వారితో గ్రామజ్యోతి కార్యక్రమంపై ఆరా తీశారు. వెంటనే నేనే వస్తా..శ్రమదానం చేస్తా అని హామీ ఇచ్చారు. దీంతో గ్రామస్తుల ఆనందం ఆకాశనంటింది. 20న గ్రామంలో సీఎం కేసీఆర్ పాదయాత్ర చేస్తూ శ్రమదానం చేశారు. అలాగే సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం జరిగిన గ్రామజ్యోతి గ్రామసభలో ఎర్రవల్లిని దత్తత తీసుకుంటున్నానని ప్రకటించారు. ఇక్క అక్కడి నుంచి ఎర్రవల్లికి తరుచూ సీఎం వస్తున్నారు. వచ్చినప్పుడల్లా వరలా జల్లులు కురిపిస్తూనే ఉన్నారు. ఊరంతా డబల్‌బెడ్రూం ఇళ్లు కట్టిస్తామని ప్రకటన చేశారు. గ్రామస్తులతో కలిసి సంహపక్తి భోజనం చేశారు.
విత్తనోత్పత్తిపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఎర్రవల్లిని విత్తనోత్పత్తి భండాగరంగా ప్రకటించారు. గ్రామంలో 12 వందల మందికి సరిపడే కమ్యూనీటి భవనం, గ్రంథాలయం, బ్యాంకు, బస్‌స్టేషన్, ప్రాథమిక ఆరోగ్యకేంద్రం, విత్తనోత్పత్తి గ్రామంగా ఎర్రవల్లిని తీర్చిదిద్దుతున్నారు. ఎర్రవల్లి మదిరిగా నర్సన్నపేటను కూడా దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఎర్రవల్లి, నర్సన్నపేటను రాష్ట్రంలో బంగారు తునకాలుగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.
నర్సన్నపేటకు 200 డబల్‌బెడ్రూం ఇళ్లను మంజూరు చేశారు. అలాగే ఊరంతా డ్రిప్పు ఇరిగేషన్, గోదావరి నీళ్లు అందిస్తామని, కూడవెల్లి వాగుకు పూర్వవైభవనం తీసుకొస్తామని ప్రకటించారు. ఇదిలా ఉండగా.. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా రూ. 6.36 కోట్ల నిధులతో మంజూరు అయిన 45 ట్రాక్టర్లను లబ్ధిదారులకు అందించారు. శ్రావణమాసంలో గృహప్రవేశాలు చేయాలని చేయనున్నట్లు ప్రకటించారు.
అభివృద్ధి పనుల వేగవంతం...
సుమారు రూ. 150 కోట్ల నిధులతో రెండు గ్రామాల్లో డబల్‌బెడ్రూం, కుంటల అభివృద్ధి, కూడవెల్లి ఆధునీకరణ, పాండురంగరిజర్వాయర్, డ్రిప్పు పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ నెల 31 న సామూహిక గృహప్రవేశాలు చేయాలని సంకల్పంతో అధికారులు ఇండ్లను పనుల్లో వేగవంతం చేస్తున్నారు.మొత్తం మీద ఏడాదిలో రెండు గ్రామాలు రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు వచ్చాయి. రానున్న రోజుల్లో ఆదర్శ గ్రామాలు మారనున్నాయి.