మారుతున్న ఖమ్మం నగర ముఖ చిత్రానికి అనుగుణంగా కార్పొరేషన్ పరిధిలోని ప్రతి డివిజన్‌లో రోడ్ సూచికలను ఏర్పాటు చేయాలని, దీంతో ప్రజలకు సౌకర్యవంతంగా
ఖమ్మం : మారుతున్న ఖమ్మం నగర ముఖ చిత్రానికి అనుగుణంగా కార్పొరేషన్ పరిధిలోని ప్రతి డివిజన్‌లో రోడ్ సూచికలను ఏర్పాటు చేయాలని, దీంతో ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుందని ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ కార్పొరేటర్లకు సూచించారు. ఆదివారం స్థానిక 16వ డివిజన్ కార్పొరేటర్ కమర్తపు మురళి ఆధ్వర్యంలో డివిజన్‌లో ఏర్పాటు చేసిన రోడ్ సూచికలను ప్రారంభించారు. డివిజన్‌లోని బోనకల్ రోడ్, శాంతినగర్‌రోడ్, పాకబండరోడ్‌లో 29 రోడ్ సూచికలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ తరహాలో ప్రతి ఒక్క కార్పొరేటర్ చొరవ చూపి నగర సుందరీకరణలో పాలుపంచుకోవాలని సూచించారు. అనంతరం ఇటీవల పూర్తి చేసిన సీసీ రోడ్ నిర్మాణంలో జరిగిన నాణ్యతను పరిశీలించారు. కార్యక్రమంలో తాజుద్దీన్, నాగరాజు, సురేష్, రెహమన్, మనోహర్, సాయి, నరేష్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.