
ఈవ్‌టీజర్లకు కౌన్సిలింగ్
యువతులను వేధిస్తున్న ఈవ్‌టీజర్లపై సైబరాబాద్ ఈస్ట్, వెస్ట్ షీ బృందాలు కొరడా ఝుళిపిస్తున్నాయి. వేధింపుల నుంచి అమ్మాయిలను
యువతులను వేధిస్తున్న ఈవ్‌టీజర్లపై సైబరాబాద్ ఈస్ట్, వెస్ట్ షీ బృందాలు కొరడా ఝుళిపిస్తున్నాయి. వేధింపుల నుంచి అమ్మాయిలను రక్షించేందుకు సైబరాబాద్ ఈస్ట్, వెస్ట్ పరిధిలో సెలైంట్‌గా తమ పని కానిస్తున్న 60 షీ బృందాలు ఈనెల 4 నుంచి 16వ తేదీ వరకు 32 కేసుల్లో 43 మంది ఈవ్‌టీజర్లను పట్టుకున్నాయి. సైబరాబాద్ ఈస్ట్‌లో 17 కేసులు, సైబరాబాద్ వెస్ట్‌లో 15 కేసులు నమోదు చేశాయి. షీ బృందాలకు పట్టుబడిన వారిలో అత్యధికంగా 20 ఏళ్లు పైబడిన విద్యార్థులే అధికంగా ఉన్నారు.
వీరందరికి గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలోని సీఏడబ్ల్యూ హాల్‌లో శనివారం కౌన్సిలింగ్ నిర్వహించారు. కార్యక్రమంలో సైబరాబాద్ ఈస్ట్ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్, షీ టీమ్స్ ఇన్‌చార్జి, ఏసీపీ శ్రీనివాసులు, ట్రాఫిక్ ఏసీపీ స్నేహిత తదితరులు పాల్గొన్నారు. - సాక్షి, సిటీబ్యూరో