‘ఏపీలో లక్షా 42 వేల ఉద్యోగాలు ఖాళీ’
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ లో రోజురోజుకు నిరుద్యోగం పెరిగిపోతోందని మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ విమర్శించారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామన్న చంద్రబాబు ఎన్నికల హామీ ఏమైందని ఆయన ప్రశ్నించారు. ఉద్యోగం ఇవ్వకపోతే.. నిరుద్యోగ భృతి అన్నారు..అదీ లేదని ఆరోపించారు. ఏపీలో లక్షా 42 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు.
బాబు కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా.. ఉన్న ఉద్యోగాలను తొలగిస్తున్నారన్నారు. రాజధానికి భూములిచ్చిన రైతుల పిల్లలకు ఇస్తామన్న ఉద్యోగాలు ఏమయ్యాయన్నారు. నిబంధనలకు విరుద్ధంగా కన్సల్టెన్సీలకు లక్షల్లో జీతాలు ఇస్తున్నారని.. ఆ అంశంపై హైకోర్టులో పిటిషన్ వేస్తామని నాదేండ్ల తెలిపారు