Former Speaker Nadendla Manohar
-
రూ.లక్షల కోట్ల పెట్టుబడులేవి బాబూ!
-
రూ.లక్షల కోట్ల పెట్టుబడులేవి బాబూ!
ముఖ్యమంత్రి చంద్రబాబుపై మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ధ్వజం , రూ.లక్షల కోట్ల సాక్షి, అమరావతి: ఒప్పందాలు, పెట్టుబడుల పేరిట ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రానికి ఏదో మేలు చేస్తున్నాననే భ్రమలు కల్పిస్తూ తప్పుడు ప్రకటనలతో ప్రజలను మోసం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నేత, అసెంబ్లీ మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ధ్వజమెత్తారు. ఆయన గురువారం విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. గతేడాది జనవరి 12న విశాఖలో నిర్వహించిన పారిశ్రామిక భాగస్వామ్య సదస్సులో ప్రభుత్వం 331 సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుందని గుర్తుచేశారు. ఆయా కంపెనీల సామర్థ్యంపై విచారణ జరపకుండానే ఒప్పందాలు చేసుకోవడం శోచనీయమని అన్నారు. -
సీఎంపై మాజీ స్పీకర్ ధ్వజం
అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కారణంగా తెలుగువారికి తీరని అన్యాయం జరుగుతోందంటూ మాజీ స్పీకర్, పీసీసీ ఉపాధ్యక్షుడు నాదెండ్ల మనోహర్ ధ్వజమెత్తారు. విజయవాడలో ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. సీఎం తనకు కావాల్సిన వారికి ఉద్యోగాలు కట్టబెట్టేందుకు కన్సల్టెన్సీ అనే ఒక పదాన్ని వాడుకొని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇందులో భాగంగానే పరిశ్రమల విభాగంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పోస్టుకు రాజేంద్ర అనే వ్యక్తి బయోడేటా ఇచ్చిన వెంటనే సీఎం ఆదేశాల మేరకు ఆగమేఘాలపై నియామక ఉత్తర్వులు ఇచ్చారన్నారు. కష్టపడి చదువుకున్న సమర్థులైన తెలుగు విద్యార్థులను కాదని, ఎక్కువ శాతం ఇతర రాష్ట్రాల విద్యార్థులను యంగ్ ప్రొఫెషనల్స్ పేరిట ఇప్పటి వరకు 35 మందిని నియమిస్తే, ఆ నియామకాలకు సంబంధించి ఒకే రకమైన ఈ-మెయిల్స్, ఫోన్ నంబర్లు ఉండటం అనుమానాలకు తావిస్తోందన్నారు. 2014 ఎన్నికల్లో సంవత్సరానికి కోటి ఉద్యోగాలు ఇస్తామని బీజేపీ, బాబు వస్తే జాబు వస్తుందని టీడీపీ యువతకు హామీ ఇచ్చినా... అధికారంలోకి వచ్చాక అమలులో అయిన వారికే ప్రభుత్వ కొలువులు, ఉపాధి కాంట్రాక్టులను కట్టబెడుతూ రాష్ట్రంలోని యువతను నయవంచనకు గురి చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎప్పుడూ లేనివిధంగా గత ఐదేళ్లతో పోలిస్తే నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందని నాదెండ్ల మనోహర్ అభిప్రాయపడ్డారు. -
‘ఏపీలో లక్షా 42 వేల ఉద్యోగాలు ఖాళీ’
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ లో రోజురోజుకు నిరుద్యోగం పెరిగిపోతోందని మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ విమర్శించారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామన్న చంద్రబాబు ఎన్నికల హామీ ఏమైందని ఆయన ప్రశ్నించారు. ఉద్యోగం ఇవ్వకపోతే.. నిరుద్యోగ భృతి అన్నారు..అదీ లేదని ఆరోపించారు. ఏపీలో లక్షా 42 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు. బాబు కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా.. ఉన్న ఉద్యోగాలను తొలగిస్తున్నారన్నారు. రాజధానికి భూములిచ్చిన రైతుల పిల్లలకు ఇస్తామన్న ఉద్యోగాలు ఏమయ్యాయన్నారు. నిబంధనలకు విరుద్ధంగా కన్సల్టెన్సీలకు లక్షల్లో జీతాలు ఇస్తున్నారని.. ఆ అంశంపై హైకోర్టులో పిటిషన్ వేస్తామని నాదేండ్ల తెలిపారు