ఒప్పందాలు, పెట్టుబడుల పేరిట ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రానికి ఏదో మేలు చేస్తున్నాననే భ్రమలు కల్పిస్తూ తప్పుడు ప్రకటనలతో ప్రజలను మోసం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నేత, అసెంబ్లీ మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ధ్వజమెత్తారు. ఆయన గురువారం విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. గతేడాది జనవరి 12న విశాఖలో నిర్వహించిన పారిశ్రామిక భాగస్వామ్య సదస్సులో ప్రభుత్వం 331 సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుందని గుర్తుచేశారు. ఆయా కంపెనీల సామర్థ్యంపై విచారణ జరపకుండానే ఒప్పందాలు చేసుకోవడం శోచనీయమని అన్నారు.