500 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం
Published Tue, Jul 26 2016 1:59 AM | Last Updated on Mon, Sep 4 2017 6:14 AM
విజయనగరం రూరల్: గజపతినగరం ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని బొండపల్లి మండలం పనసలపాడు గ్రామంలో ఎక్సైజ్ అధికారులు సోమవారం దాడులు చేపట్టి సుమారు 500 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేశారు. ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏఈఎస్ వై. భీమ్‌రెడ్డి ఆదేశాల మేరకు సిబ్బంది దాడులు చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు నవోదయం కార్యక్రమంలో భాగంగా అవగాహన సదస్సు నిర్వహించారు. సారా తయారీ, విక్రయాల వల్ల కలిగే అనర్థాలను వివరించారు. కార్యక్రమంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐ లోకేష్, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement