Gajapatinagaram
-
ప్రాణం తీసిన పరిచయం
-
అనుమానాస్పదంగా వివాహిత మృతి
గజపతినగరం రూరల్: మండలంలోని బంగారమ్మపేట గ్రామానికి చెందిన తాడితూరి అనూష (అలియాస్ తనూజ20) ఆదివారం రాత్రి మృతి చెందగా.. తమ కుమార్తె మృతిపట్ల అనుమానాలున్నాయంటూ మృతురాలి తండ్రి రమణ గజపతినగరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు బొబ్బిలి డీఎస్పీ పి.శ్రీనివాస్ సోమవారం తన బృందంతో గ్రామంలోని సంఘటనా స్ధలానికి చేరుకుని విచారణ చేపట్టారు. గ్రామంలో మృతురాలి బంధువులు, తోటి స్నేహితులను వాకబు చేశారు. అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడుతూ నాలుగుమాసాల క్రితం ఇదే గ్రామానికి చెందిన సీఆర్పీఎఫ్ జవాన్‌తో అనూషకు వివాహమైంది. కాపురం ఆనందంగానే సాగుతోందని, అయితే ఆమె వివాహానికి ముందు ఇదే గ్రామానికి చెందిన బోనివెంకటదుర్గాప్రసాద్ అనూషను ప్రేమించాడని, వివాహమైన తరువాత కూడా చీటికీమాటికీ వేధింపులకు గురిచేసినట్లు తెలిసిందన్నారు. ఈ వేధింపులు ఇటీవల బాగా అధికమవడం, తనతో పాటు బయటకు వచ్చి కోరిక తీర్చాలని, లేకుంటే నీతో తీసుకున్న సెల్ఫీలు, ఆడియో, వీడియో కాల్స్ గ్రామంలోని అందరికి చూపిస్తానని పదేపదే బెదిరించడంతో ఏం చేయాలో తెలియక అనూష ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోందన్నారు. చనిపోయేముందు స్నేహితురాలికి, తన అన్నయ్యకు ఫోన్ చేసి అనూష ఈ సమాచారం పంపించిందని, ఈ సమాచారం ఆధారంగా ఈవిషయాలను తెలుసుకున్నామన్నారు.పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని విజయనగరం కేంద్రాస్పత్రికి తరలించి కేసు నమోదుచేసి దర్యాప్తు ముమ్మరం చేస్తామన్నారు. నివేదిక ఆధారంగా పూర్తిస్ధాయి వివరాలను తరువాత వెల్లడించనున్నామని తెలిపారు. ఈ పరిశీలనలో సీఐ ప్రభాకర్, ఎస్సై యు.మహేష్, తదితరులు పాల్గొన్నారు -
గజపతినగరం సబ్ రిజిస్ట్రార్‌పై వేటు
విజయనగరం రూరల్: కొన్ని నెలలుగా నకిలీ చలానాలు వెలుగుచూస్తున్నా.. పరిశీలన జరపకుండా ప్రభుత్వ ఆదాయానికి నష్టం చేకూరేలా వ్యవహరించిన గజపతినగరం సబ్ రిజిస్ట్రార్‌పై అధికారులు వేటు వేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సంచలనం సృష్టించిన నకిలీ చలానాల కుంభకోణంలో భాగంగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో దస్తావేజులకు వచ్చిన చలానాలను అధికారులు పరిశీలిస్తున్న విషయం తెలిసిందే. జిల్లాలోని 13 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూలై వరకూ చలానాలను అధికారులు పరిశీలించారు. దీంతో గజపతినగరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నకిలీ చలానాల కుంభకోణం వెలుగుచూసింది. ఈ నేపథ్యంలో 2020 ఏప్రిల్ నుంచి చలానాలను పరిశీలించగా.. మరికొన్ని నకిలీ చలానాలు బయటపడ్డాయి. 16 నెలల కాలంలో 130 నకిలీ చలానాలు బయటపడగా, రూ. 35,18,590ల ప్రభుత్వ ఆదాయానికి గండిపడింది. దీనితో ప్రమేయమున్న దస్తావేజు లేఖర్లు, వారి సహాయకులపై సబ్ రిజిస్ట్రార్ ఈశ్వరమ్మ స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేశారు. మొత్తం సొమ్మును వారి నుంచి వసూలు చేసి ప్రభుత్వ ఖజానాకు జమ చేశారు. ఇంత జరుగుతున్నా సరైన పరిశీలన జరపని సబ్ రిజిస్ట్రార్‌తో పాటు, సీనియర్ సహాయకుడు మహేష్, జూనియర్ అసిస్టెంట్ నర్సింగరావులను సస్పెండ్ చేస్తూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ డీఐజీ కళ్యాణి బుధవారం ఉత్తర్వులిచ్చారు. -
గజపతినగరంలో పాగావేసేదెవరు..?
సాక్షిప్రతినిధి, విజయనగరం: ఎన్నికలు జరగకుండానే ఫలితం చెప్పేయగల నియోజకవర్గం జిల్లాలో ఏదైనా ఉందంటే ముందుగా చెప్పుకోవాల్సింది గజపతినగరం నియోజకవర్గాన్నే. ఇక్కడ ప్రధాన ప్రత్యర్థులైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ అభ్యర్థులపై ప్రజల్లో ఉన్న అభిప్రాయమే దీనికి ప్రధాన కారణం. ఐదేళ్లుగా అవినీతి తప్ప ప్రజాప్రయోజనాల గురించి ఏమాత్రం ఆలోచించని అధికారపార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే కేఏ నాయుడు ఆ పార్టీ అభ్యర్థిగా మరలా పోటీలోకి దిగారు. ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకుండా క్లీన్ ఇమేజ్‌తో, నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడే నాయకుడిగా పేరుపొందిన బొత్స అప్పలనర్సయ్య వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా రంగంలోకి దిగారు. ఈ ఇద్దరిలో ఎవరిది విజయమనేదానిపై ఇప్పటికే ప్రజల్లో ఓ స్పష్టత వచ్చేసింది.అధికారంలో ఉన్నా లేక పోయినా అప్పలనర్సయ్య నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండడం, బలమైన కార్యకర్తల అండదండలతో ఇక్కడ వార్ ఒన్‌సైడ్ అయినట్టే కనిపిస్తోంది. అప్పలనర్సయ్యకు మంచి పేరు బొత్స అప్పలనర్సయ్య విజయనగరం ఎస్సీ కార్పొరేషన్లో డీఈగా ఉద్యోగం చేసేవారు. అన్న బొత్స సత్యానారాయణ మంత్రిగా, వదిన ఝాన్సీ ఎంపీగా ఉండడంతో వారిని ఆదర్శంగా తీసుకుని ప్రజా సేవ చేయాలనే ఉద్దేశంతో ఉద్యోగానికి రాజీనామా చేశారు. 2001లో బొండపల్లి, 2006లో దత్తిరాజేరు జెడ్పీటీసీగా గెలిచారు. 2009లో టీడీపీ అభ్యర్థి మాజీ మంత్రి పడాల అరుణపై ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి, మంచి పనులు చేయడంతో పాటు మంచి వ్యక్తి, కార్యకర్తలను క్రమశిక్షణతో నడిపించగలరనే పేరు తెచ్చుకున్నారు. కొండపల్లికి అన్నీ ప్రతికూలతలే... ప్రైవేటు వైద్యుడిగా ఉండి, తండ్రి దివంగత ఎంపీ కొండపల్లి పైడితల్లినాయుడి రాజకీయ వారసుడుగా వచ్చిన కొండపల్లి అప్పలనాయుడు రెండు సార్లు ఎంపీగా పోటీ చేసి బొత్స వారి చేతిలో ఓటమి పాలయ్యారు. 2014 వరకు చీపురుపల్లి టీడీపీ ఇన్చార్జిగా ఉన్న కేఏ నాయుడుని ఎన్నికలు మందు గజపతినగరం ఇన్చార్జ్ పదవి ఇచ్చి అనంతరం ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ కేటాయించారు. 2014లో టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికైన కేఏ నాయుడు ప్రజలకు అందుబాటులో ఉండరనే అపవాదు ఉంది. గ్రామాల్లో పర్యటించి ప్రజా సమస్యలు పరిష్కరించడమనేది ఐదేళ్లలో ఏనాడూ జరగలేదు. నమ్మకున్న కార్యకర్తలకే న్యాయం చేయరనే చెడ్డ పేరు సంపాదించారు. చివరికి తన సొంత అన్నకే మంచి చేయలేకపోయారు. నియోజకవర్గంలో ఆయన చేయని అవినీతి లేదనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. దీంతో ఆయన అన్న కొండలరావు పెద్ద తిరుగుబాటే చేశారు. చివరికి తమ్ముడిపైనా, టీడీపీపైనా నమ్మకం లేక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి అప్పలనర్సయ్యకు మద్దతు పలికారు. గజపతినగరం చరిత్ర ఇలా... గజపతినగరం నియోజకవర్గం 1955లో ఏర్పాటైంది. పూసపాటి వంశానికి చెందిన పీవీజీ రాజు భార్య (ఎంపీ అశోక్ తల్లి) తొలి ఎమ్మెల్యేగా ఎన్నియ్యారు. ఒకసారి పెనుమత్స సాంబశివరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇప్పటి వరకు 15 మంది ఎమ్మెల్యేలుగా పని చేశారు. గజపతినగరం నియోజకవర్గం జనాభా, ఓటర్లు ఇలా.. జనాభా 2,86,820 ఓటర్లు 1,90,898 పురుషులు 94,350 స్త్రీలు 96,424 ఇతరులు 4 పోలింగ్ స్టేషన్లు 264 -
గజపతినగరం అతివల చేతిలోనే అభ్యర్థుల గెలుపు
సాక్షి, గజపతినగరం: నియోజకవర్గం అభ్యర్థుల గెలుపు అతివల చేతిలోనే ఉంది. నియోజకవర్గంలో మహిళా ఓటర్లే ఎక్కువ. నియోజకవర్గంలోని దత్తిరాజేరు, గజపతినగరం, బొండపల్లి, గంట్యాడ, జామి మండలాలు ఉన్నాయి. 2019 అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ కోసం నియోజకవర్గాన్ని 22 జోన్లుగా (సెక్టారులుగా), 34 రూట్లుగా విభజించారు. ఎన్నికల నిర్వహణ సౌలభ్యం కోసం ఎన్నికలు సామగ్రి తరలింపు కోసం జోన్లు, రూట్లుగా విభజించారు. నియోజకవర్గంలో మొత్తం 236 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. 23 సమస్యాత్మక గ్రామాలను గుర్తించారు. ఒక్కో కేంద్రానికి ఒక పోలింగ్ అధికారి, ఐదుగురు ఎన్నికలు సిబ్బంది కలసి మొత్తం 1200 మందిని నియమించినట్టు ఆర్వో వెంకటరావు తెలిపారు. నియోజకవర్గం ఆవిర్బావం నియోజకవర్గం ఆవిర్భావం(1955) నుంచి వరుసగా స్థానికేతరులే ఎన్నికవుతూ వస్తున్నారు. కాపు సామాజిక వర్గ అభ్యర్థులే ఇక్కడ పాలన సాగిస్తున్నారు. తొలి ఎమ్మెల్యేగా సోషలిస్ట్ పార్టీ నుంచి విజయనగరం పూసపాటి రాజు వంశీయులు, విజయనగరం సంస్థానీదీశుడు పీవీజీ రాజు భార్య కుసుమ గజపతిరాజు (ఎంపీ అశోక్‌తల్లి) ఎన్నికయ్యారు. వ్యక్తిగత కారణాలతో ఆమె1959లో రాజీనామా చేశారు. తదనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో మెంటాడ మండలం చల్లపేట గ్రామానికి చెందిన తాడ్డి సన్యాసినాయడుపై పీవీజీ రాజు (సోషలిస్ట్ పార్టీ) గెలుపొందారు. 1967లో కాంగ్రెస్ అభ్యర్థిగా తాడ్డి సన్యాసినాయుడు... పెనుమత్స సాంబశివరాజుపై గెలిచారు. 1972లో జరిగిన ఎన్నికల్లో ఏకగ్రీవంగా సాంబశివరాజు ఎన్నికయ్యారు. 1978 ఎన్నికల్లో జనతా పార్టీ అభ్యర్థిగా దత్తిరాజేరు మండలం గోభ్యాం గ్రామానికి చెందిన వంగపండు నారాయణప్పలనాయుడు తాడ్డి సన్యాసినాయుడుపై గెలిపొందారు. 1983లో టీడీపీ అభ్యర్థి జంపాన సత్యనారాయణరాజు గెలిపొందారు. అప్పట్లో శాసనసభ రద్దు కావడంతో రెండేళ్ల వ్యవధిలో 1985లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి వంగపండు నారాయణప్పలనాయడు తాడ్డి సన్యాసినాయడు మద్దుతో గెలిపొందారు.1 989లో జరిగిన ఎన్నికల్లో బొండపల్లి మండల పరిషత్ అధ్యక్షురాలిగా ఉన్న పడాల అరుణ టీడీపీ తరఫున పోటీచేసి వంగపండు నారాయణప్పలనాయడుపై గెలిపొందారు. 1994లో జరిగిన ఎన్నికల్లో తాడ్డి వంగపండు వర్గాలు ఒక్కటైనా మరలా టీడీపీ అభ్యర్థి పడాల అరుణను గెలిపించాయి. 1999లో జరిగిన ఎన్నికల్లో మోంటాడ మండల అధ్యక్షుడిగా ఉన్న తాడ్డి వెంకటరావు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిపొందారు. 2004లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి తాడ్డి ఇండిపెండెంట్‌గా వంగపడు పోటీ చేయగా వారిపై టీడీపీ అభ్యర్థి పడాల అరుణ మూడో సారి గెలుపొందారు. 2009లో పడాల అరుణపై ప్రస్తుత వైఎస్సార్ సీపీ అభ్యర్థి బొత్స అప్పలనర్సయ్య గెలుపొందారు. 2014లో జరిగిన ఎన్నికల్లో రెండు సార్లు టీడీపీ నుంచి ఎంపీగా పోటీచేసి ఓడి పోయిన కొండపల్లి అప్పలనాయుడు వైఎస్సార్సీపీ అభ్యర్థి కడుబండిపై గెలిపొందారు. ప్రధాన సమస్యలు... నియోజకవర్గ కేంద్రం గజపతినగరంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేదు. దీంతో ఇక్కడి విద్యార్థులు పొరుగు నియోజకవర్గాలకు వెళ్లి చదువులు సాగించాల్సి వస్తోంది. నియోజకవర్గం ఇంచుమించుగా వ్యవసాయ ప్రాంతం. తోటపల్లి ప్రాజెక్టు నీటిని నియోజకవర్గానికి అందించేందుకు కృషిచేసిన ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి మరణంతో పనులు నిలిచిపోయాయి. కాలువ పనులు ముందుకు సాగలేదు. ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన బైపాస్ రోడ్డు నిర్మాణం కలగానే మిగిలింది. గజపతినగరం నడిబొడ్డులో ఉన్న ఆర్టీసీ కాంప్లెక్స్‌కు వెళ్లాలంటే భయం వేస్తోంది. గజపతినగరంలో మురుగునీటి పారుదల వ్యవస్థ అధ్వానం. కాలువల నిర్మాణం సరిగా లేకపోవడంతో ఎక్కడికక్కడే మురుగునీరు నిల్వ ఉంటోంది. అండర్ డ్రైనేజీ నిర్మాణాన్ని టీడీపీ నేతలు పూర్తిగా విస్మరించారు. నియోజకవర్గ ప్రజలను తాగునీటి సమస్య వెంటాడుతోంది. గంట్యాడ మండలంలోన ఉన్న తాటిపూడి ఒకప్పుడు పర్యాటక కేంద్రంగా కళకళలాడేది. నిధులు కేటాయించకపోవం, అభివృద్ధి పనులు సాగకపోవడంతో పర్యాటక కళ తప్పింది. తాటి జలాశయం వద్ద మెట్లు పాడైనా పట్టించుకోవడంలేదు. అక్కడికి వెళ్లేందుకు రోడ్డు కూడా బాగులేకపోవడంతో రాకపోకలకు పర్యాటకులు ఇబ్బందులు పడుతున్నారు. నియోజకవర్గ వాసులకు సంక్షేమ పథకాలు అందని ద్రాక్షగా మారాయి. జన్మభూమి కమిటీల కాళ్లుపట్టుకునేవారికే పింఛన్లు, ఇళ్లు, బీసీ రుణాలు మంజూరు చేశారు. అర్హులకు మొండిచేయి చూపారు. ఐదేళ్లలో నియోజకవర్గంలో అవినీతి పాలన సాగింది. గజపతినగరం నియోజకవర్గం ప్రొఫైల్... మొత్తం ఓటర్లు 1, 90,878 పురుషులు 94,350 మహిళలు 96,524 థర్డ్ జండర్ 4 రాజకీయంగా ప్రభావితం చేసే కులాలు: (తూర్పు కాపు, కొప్పల వెలమ) నియోజకవర్గ విస్తీర్ణం: 14,210 స్కేర్ మీటర్లు, (162 కిలో మీటర్లు) పంచాయతీలు: 136 పింఛన్లు: పాతవి 34,074 మొత్తం రేషన్ కార్డులు: 79,364 (అంత్యోదయ రేషన్‌కార్డులు: 5,765, తెలుపు రేషన్ కార్డులు: 64,092) -
‘రిపోర్టులు బాగాలేవన్నారు.. టికెట్ ఇచ్చారు..!’
సాక్షి, విజయనగరం : టీడీపీలో టికెట్ల పంచాయతీ కొనసాగుతోంది. టికెట్లు దక్కని సిట్టింగ్ ఎమ్మెల్యేలు తమ నిరసన గళాలు వినిపిస్తుండగా.. అవినీతి ఆరోపణలున్న నేతలకు టికెట్ ఇస్తే సహించేది లేదని పార్టీ నేతలు తెగేసి చెప్తున్నారు. టీడీపీ తొలి జాబితాలో గజపతి నగరం టికెట్ సిట్టింగ్ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడుకి కేటాయించడంపై అసమ్మతి వెల్లువెత్తుతోంది. అవినీతి ఆరోపణలు, అధికారులపై వేధింపులు వంటి అంశాల్లో అపప్రద మూటగట్టుకున్న అప్పలనాయుడుకి సీటిస్తే పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుందని ఆయన సోదరుడు, పార్టీ సీనియర్ నాయకుడు కొండపల్లి కొండలరావు స్పష్టం చేశారు. ఎమ్మెల్యే కేఏ నాయుడుకు వ్యతిరేకంగా అనేక అంతర్గత సర్వేల రిపోర్టులు తమవద్ద ఉన్నాయని చెప్పిన టీడీపీ మరలా ఆయనకే అవకాశం ఇచ్చిందని మండిపడ్డారు. కేఏ నాయుడును బరిలోకి దించి పార్టీని నాశనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ కొండలరావు ఆధ్వర్యంలో పార్టీ నేతలు, పలువురు ఎంపీటీసీలు, సర్పంచులు, మాజీ ప్రజాప్రతినిధులు సమావేశమయ్యారు. రేపటి (ఆదివారం) ముఖ్యమంత్రి పర్యటనలో గజపతినగరం అభ్యర్థిని మార్చే విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. -
అప్పలనాయుడా మజాకా!
-
సోషల్ మీడియాలో పోస్టులు.. తట్టుకోలేకపోయిన ఎమ్మెల్యే!
సాక్షి, విజయనగరం: హామీల అమలు విషయంలో ప్రభుత్వ తీరును విమర్శిస్తూ సోషల్ మీడియాలో వస్తున్న పోస్టింగులను ప్రభుత్వ పెద్ద చంద్రబాబే కాదు.. టీడీపీ ప్రజాప్రతినిధులు కూడా సహించలేకపోతున్నారు. మాపైనే రాతలా అంటూ అగ్గి మీద గుగ్గిలమైపోతున్నారు. తాజాగా విజయనగరం జిల్లా గజపతినగరం ఎమ్మెల్యే కేఏ నాయుడు నెటిజన్లపై తన అక్కసును వెల్లగక్కారు. ప్రజలకిచ్చిన హామీలను ఎమ్మెల్యే నిలబెట్టుకోలేదంటూ సోషల్ మీడియాలో కొన్ని పోస్టింగులు హల్చల్ చేస్తున్నాయి. వాటిని ఎమ్మెల్యే తట్టుకోలేకపోయారు. వెంటనే తన అనుచరులతో వచ్చి స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు కొందరు యువకులను స్టేషన్‌కు పిలిపించి విచారిస్తున్నారు. ఇప్పటికే 'ఇంటింటికీ తెలుగుదేశం' కార్యక్రమానికి వెళ్తున్న తెలుగు తమ్ముళ్లను ప్రజలు నిలదీస్తుండగా సోషల్ మీడియాలోనూ విమర్శలు వెల్లువెత్తుతుండడంతో అధికార పార్టీ నేతలు మరింత అసహనానికి గురవుతున్నారు. -
500 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం
విజయనగరం రూరల్: గజపతినగరం ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని బొండపల్లి మండలం పనసలపాడు గ్రామంలో ఎక్సైజ్ అధికారులు సోమవారం దాడులు చేపట్టి సుమారు 500 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేశారు. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఏఈఎస్ వై. భీమ్‌రెడ్డి ఆదేశాల మేరకు సిబ్బంది దాడులు చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు నవోదయం కార్యక్రమంలో భాగంగా అవగాహన సదస్సు నిర్వహించారు. సారా తయారీ, విక్రయాల వల్ల కలిగే అనర్థాలను వివరించారు. కార్యక్రమంలో ఎన్ఫోర్స్మెంట్ సీఐ లోకేష్, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. -
జగన్ జనభేరీ రోడ్ షో
-
'విద్యుత్ కోతలేని రాష్ట్రంగా చూపుతా'
-
విద్యుత్ కోతలేని రాష్ట్రంగా చూపుతా: వైఎస్ జగన్
విజయనగరం: తాము అధికారంలోకి వచ్చిన తరువాత విద్యుత్ కోతలేని రాష్ట్రంగా చూపుతానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి హామీ ఇచ్చారు. విజయనగరం జిల్లా గజపతినగరంలో జరిగిన వైఎస్ఆర్ సిపి జనపథం బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. అధికారంలోకి రాగానే రాష్ట్ర దశ, దిశ మార్చేసే ఐదు సంతకాలు చేస్తానని చెప్పారు. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు,తనకు ఉన్న తేడా విశ్వసనీయత అన్నారు. దివంగత మహానేత వైఎస్ఆర్ నుంచి తనకు వారసత్వంగా వచ్చింది ఏమైనా ఉందంటే అది విశ్వసనీయతేనని చెప్పారు. మన చంద్రబాబుకి రాష్ట్రంలో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయో తెలుసా? ఇంటికో ఉద్యోగం పేరుతో మూడున్నర కోట్ల ఉద్యోగాలు ఇస్తాడట. ఆయనలా తాను మోసం చేయలేనని చెప్పారు. పొలాలు అమ్ముకుని పిల్లలను చదివించే తల్లిదండ్రులను బాబు హయాంలో చూశామన్నారు. ఆయన సీఎంగా ఉన్నప్పుడు పిల్లల చదువుల గురించి ఏనాడూ పట్టించుకోలేదని చెప్పారు. పేదవాడి గుండె ఆపరేషన్ కోసం జీవిత కాలం ఊడిగం చేసిన భయానక రోజులు ఇంకా గుర్తొస్తున్నాయన్నారు. ఎన్నికలకు వెళ్లే ప్రతిసమయంలో చంద్రబాబు ఏదో ఒక హామీ ఇచ్చేవాడన్నారు. ఎన్నికలయ్యాక ఆ హామీలను గాలికొదిలేసేవాడని, విశ్వసనీయత అన్న పదానికి ఆయనకు అర్థం తెలియదని విమర్శించారు. 2 కిలో రెండు రూపాయల బియ్యాన్ని 5 రూపాయల 25 పైసలు చేసిన ఘనుడు చంద్రబాబు అన్నారు. రుణాల మాఫీ ఎలా ఉన్నా వడ్డీ మాఫీ చేయాలని నాడు వైఎస్ అడిగినా కరుణించలేదని చెప్పారు. మానవత్వం లేని చంద్రబాబు ఇప్పుడు సాధ్యంకాని హామీలను గుప్పిస్తున్నాడన్నారు. ఆల్ ఫ్రీ అంటూ ప్రజలను వంచించేందుకు ముందుకొస్తున్నాడని హెచ్చరించారు. ఉచితంగా సెల్ఫోన్లు, ఫ్రీగా కలర్ టీవీలు ఇస్తానంటున్నాడు. డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తానంటున్నాడని చెప్పారు. అంగన్వాడీ కార్యకర్తలను గుర్రాలతో తొక్కించిన ఘనుడు చంద్రబాబు అని జగన్ గుర్తు చేశారు.