వ్యాయామ విద్య తప్పనిసరి
Published Sun, Aug 7 2016 7:37 PM | Last Updated on Mon, Sep 4 2017 8:17 AM
రేపల్లె రూరల్: విద్యార్థులను ఆటపాటలు, వ్యాయా మం చేయడంలోనూ భాగస్వామ్యులను చేయాలని బాపట్ల డిప్యూటీ డీఈవో ఎన్.రఘుకుమార్ చెప్పారు. వ్యాయామ విద్యలో నూతన పద్ధతుపై పట్టణంలోని అయోవా గాల్స్ హైస్కూలులో శనివారం బాపట్ల డివిజన్ పరిధిలోని వ్యాయామ ఉపాధ్యాయులకు నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. విద్యార్థుల్లో మానసిక ఉల్లాసం కలగాలంటే ఆటపాటలు, వ్యాయామం చేయించాల్సిన బాధ్యత వ్యాయామ ఉపాధ్యాయులపై ఉందన్నారు. పీఈటీలు సజ్జనరావు, నాగభూషణం, సుధీకర్‌కుమార్, కృష్ణమూర్తి, కే.బుజ్జి, తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement