ఎత్తిపోతలకు జలకళ | Eye feast at Ethipothala | Sakshi
Sakshi News home page

ఎత్తిపోతలకు జలకళ

Published Fri, Sep 23 2016 9:29 PM | Last Updated on Wed, Aug 1 2018 4:01 PM

ఎత్తిపోతలకు జలకళ - Sakshi

ఎత్తిపోతలకు జలకళ

తరలివస్తున్న పర్యాటకులు
 
మాచర్ల రూరల్‌: ప్రముఖ పర్యాటక కేంద్రమైన ఎత్తిపోతల జలపాతానికి వర్షపు నీరు భారీగా చేరుకోవటంతో జలకళతో కళకళలాడుతుంది. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో మండలంలో చంద్రవంక, కొత్తపల్లి తాటివాగు, ఈదురవాగులు భారీగా పొంగి ప్రవహిస్తుండటంతో ఆ నీరు ఎత్తిపోతల జలపాతానికి చేరుకుంటుంది. దీంతో జలపాతం నుంచి పెద్ద ఎత్తున నీరు కిందకు జాలువారుతోంది. 2004 తర్వాత ఇంత పెద్ద ఎత్తున నీరు చేరుకోవటం, 70 అడుగుల నుంచి∙నీరు జాలువారుతుండటంతో చూపరులను ఆకర్షిస్తోంది. జలపాతాన్ని తిలకించేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు చేరుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement