నకిలీ నోట్ల ముఠా అరెస్ట్
నకిలీ నోట్ల ముఠా అరెస్ట్
Published Sat, Jan 21 2017 11:16 PM | Last Updated on Tue, Sep 5 2017 1:46 AM
నంద్యాల: నూనెపల్లెలోని పశువుల సంతలో నకిలీ నోట్లను మారుస్తున్న ముఠాను అరెస్ట్ చేశామని త్రీటౌన్ సీఐ ఇస్మాయిల్ తెలిపారు. దూదేకుల రాజు, అతని సోదరుడు శ్రీనివాసులు రూ.100 నోటును కలర్ జిరాక్స్ యంత్రంతో కాపీలు తీసి నూనెపల్లె పశువుల సంతలో మార్చడానికి యత్నించారని చెప్పారు. ఈ మేరకు సమాచారం అందడంతో వీరిని అరెస్ట్ చేశారని చెప్పారు. వీరి నుంచి కలర్ జిరాక్స్ మిషన్, 8నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నామన్నారు.
నలుగురిపై బైండోవర్ కేసు..
నంద్యాల త్రీటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నవీన్, షేక్‌చాలీషా, అబ్దుల్‌ఖాదర్, చాకలి సంజీవరాయుడులపై బైండోవర్ కేసు నమోదు చేసినట్లు సీఐ ఇస్మాయిల్ తెలిపారు. వారి అదుపులోకి తీసుకొని తహసీల్దార్ శివరామిరెడ్డి ఎదుట హాజరు పరిచామని చెప్పారు.
Advertisement