పెదవేగి: పోలీసులమంటూ చెప్పి ఘరానా మోసాలకు పాల్పడుతున్న నలుగురు వ్యక్తుల ముఠాను పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం... స్థానికంగా కానిస్టేబుల్గా పనిచేసి సస్పెన్షన్‌కు గురైన వ్యక్తి ఇద్దరు ఆటో డ్రైవర్లతోపాటు ఓ స్థానిక రిపోర్టర్ ముఠాగా ఏర్పడి అక్రమాలకు పాల్పడుతున్నారని పోలీసులు తెలిపారు.
ఆ క్రమంలో ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వీరి ఆగడాలు అధికమైనాయి. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆ క్రమంలో వారిని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.దాంతో ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు.