చిగురుమామిడి (కరీంనగర్) : ఆర్థిక ఇబ్బందులతో ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఉల్లంపల్లి గ్రామంలో శనివారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన నాంపల్లి సమ్మయ్య వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో గత కొన్నేళ్లుగా పంటలు పండకపోవడంతో.. అప్పులు ఎక్కువై పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.