నరసింగరావు
అలమండ (జామి) : పిడుగు పాటుతో ఒకరు మరణించిన సంఘటన అలమండ గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన రావాడ నరసింగరావు(40) భార్య మంగమ్మతో కలిసి నాట్లు వేయడానికి బుధవారం ఉదయం పొలానికి వెళ్లాడు. ఈ క్రమంలో భార్యాభర్తలు నారు మోస్తుండగా మధ్యాహ్నం ఒక్కసారిగా పిడుగు పడడంతో నరసింగరావు అక్కడికక్కడే మతి చెందాడు. వెంటనే మంగమ్మ కేకలు వేయడంతో సమీపంలో ఉన్న వారు వచ్చి మతదేహాన్ని ఇంటికి తీసుకువచ్చారు. నరసింగరావు మతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. మతుడికి ఇద్దరు కుమార్తెలు మౌనీష, హైమావతి ఉన్నారు. మౌనీష ఇంటర్, హైమావతి పదో తరగతి చదువుతున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, తహసీల్దార్ ఉప్పు రాజకుమారి, తదితరులు వెళ్లి బాధిత కుటుంబ సభ్యులు పరామర్శించారు.