పోలీసులు పట్టుకున్న పసువులతో ఉన్న వ్యాన్
మూడు వ్యాన్‌ల పట్టివేత
Published Mon, Oct 3 2016 11:44 PM | Last Updated on Mon, Sep 4 2017 4:02 PM
అలమండసంత (జామి) : అలమండ సంత నుంచి పశువులను తరలిస్తున్న మూడు వ్యాన్‌లను ఎస్సై ఘని సోమవారం పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మూడు వ్యాన్‌లలో సుమారు 50 పశువులున్నాయన్నారు. నిబంధనలకు విరుద్ధంగా పశువులను తరలిస్తున్నందునే దాడి చేశామని చెప్పారు. పశువుల యజమానులు లిఖితపూర్వకంగా తెలియజేస్తే పశువులను అప్పగిస్తామన్నారు. పశువులను అక్రమంగా ఎవరు తరలించినా చర్యలు తప్పవన్నారు.
Advertisement
Advertisement