alamanda
-
మూడు వ్యాన్ల పట్టివేత
అలమండసంత (జామి) : అలమండ సంత నుంచి పశువులను తరలిస్తున్న మూడు వ్యాన్లను ఎస్సై ఘని సోమవారం పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మూడు వ్యాన్లలో సుమారు 50 పశువులున్నాయన్నారు. నిబంధనలకు విరుద్ధంగా పశువులను తరలిస్తున్నందునే దాడి చేశామని చెప్పారు. పశువుల యజమానులు లిఖితపూర్వకంగా తెలియజేస్తే పశువులను అప్పగిస్తామన్నారు. పశువులను అక్రమంగా ఎవరు తరలించినా చర్యలు తప్పవన్నారు. -
పిడుగు పాటుతో రైతు మరణం
అలమండ (జామి) : పిడుగు పాటుతో ఒకరు మరణించిన సంఘటన అలమండ గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన రావాడ నరసింగరావు(40) భార్య మంగమ్మతో కలిసి నాట్లు వేయడానికి బుధవారం ఉదయం పొలానికి వెళ్లాడు. ఈ క్రమంలో భార్యాభర్తలు నారు మోస్తుండగా మధ్యాహ్నం ఒక్కసారిగా పిడుగు పడడంతో నరసింగరావు అక్కడికక్కడే మతి చెందాడు. వెంటనే మంగమ్మ కేకలు వేయడంతో సమీపంలో ఉన్న వారు వచ్చి మతదేహాన్ని ఇంటికి తీసుకువచ్చారు. నరసింగరావు మతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. మతుడికి ఇద్దరు కుమార్తెలు మౌనీష, హైమావతి ఉన్నారు. మౌనీష ఇంటర్, హైమావతి పదో తరగతి చదువుతున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, తహసీల్దార్ ఉప్పు రాజకుమారి, తదితరులు వెళ్లి బాధిత కుటుంబ సభ్యులు పరామర్శించారు. -
జీవితంపై విరక్తి చెంది ఇద్దరి ఆత్మహత్య
అలమండ (జామి) : జీవితంపై విరక్తి చెంది ఇద్దరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన అలమండ, జామి గ్రామాల్లో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. అలమండ గ్రామానికి చెందిన కోట సంతోష్ (28) అనే వ్యక్తి కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో మద్యానికి బానిసవ్వడంతో జీవితంపై విరక్తి చెంది ఆదివారం రాత్రి తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం ఉదయం ఏడు గంటలైనా సంతోష్ ఇంటి నుంచి బయటకు రాకపోవడంతో, తల్లి రాములమ్మ గదిలోకి వెళ్లి చూసేసరికి కుమారుడు ఉరివేసుకుని కనిపించాడు. దీంతో ఆమె కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వారు వచ్చి పోలీసులకు సమాచారం అందజేశారు. ఎస్సై ఘని సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని పోస్టుమార్టం కోసం మతదేహాన్ని విజయనగరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇతని భార్య సంతోషి ఇటీవలే పుట్టింటికి వెళ్లింది. అలాగే జామి గ్రామంలోని మంగళవీధికి చెందిన గొర్లె ఎర్నిబాబు (30) కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అనారోగ్యం ఎంతకీ నయం కాకపోవడంతో జీవితంపై విరక్తి చెంది ఆదివారం సాయంత్రం పురుగు మందు తాగాడు. వెంటనే కుటుంబ సభ్యులు గమనించి 108 వాహనంలో విజయనగరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ, అదే రోజు రాత్రి మతి చెందాడు. మతుడికి భార్య, ఇద్దరు కుమారులున్నారు. ఎస్సై ఘని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
తీస్తున్న కొద్దీ మద్యం
అలమండ(జామి), న్యూస్‌లైన్ : వెతుకుతున్నకొద్దీ మద్యం బాటిళ్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. మండలంలోని అలమండ విజయసీతారామరాజు చెరువు గర్భంలో సుమారు 1500గోవా మద్యం బాటిళ్లను గజ ఈతగాళ్లు, ఎక్సైజ్ సిబ్బంది గురువారం వెలికి తీసిన విషయం విదితమే. శుక్రవారం కూడా ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీధర్, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కె.వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో గజ ఈతగాళ్లు చెరువులో గాలింపు చర్యలు చేపట్టారు. శుక్రవారం మరో 150 మద్యం బాటిళ్లు లభ్యమయ్యాయి. మొత్తం 1,650 బాటిళ్లు బయటపడినట్లు అసిస్టెంట్ సూపరింటెండెంట్ కె.వెంకటరామిరెడ్డి తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు చెప్పారు. చేపల పెంపకం కోసం చెరువును లీజుకు తీసుకున్న వ్యక్తిపైన, మరికొంతమందిపైన కేసులు నమోదు చేస్తున్నట్లు వివరించారు. గతంలో ఈ కేసులో నిందితులుగా ఉన్న ఆరుగురు వ్యక్తులను కూడా విచారణ జరుపుతున్నామని తెలిపారు. రాజానవానిపాలెంలో.. వ్యవసాయ బావిలో... కొత్తవలస : మండలంలోని కొత్తవలస మేజర్ పంచాయతీ శివారు రాజానవానిపాలెంలో ఎం.అప్పలనాయుడుకు చెందిన మామిడితోటలో గోవా మద్యం ఉన్నట్లు స్థానిక ఎక్సైజ్ పోలీసులు శుక్రవారం గుర్తించారు. ఈ ప్రాంతంలోని వ్యవసాయ బావిలో మద్యం సీసాలు ఉన్నాయని, కొంతమంది అప్పుడప్పుడు వీటిని తీసుకుని తాగుతున్నారని ఆ నోటా ఈ నోటా వినిపించడంతో ఎక్సైజ్ పోలీసులు రంగంలోకి దిగారు. ఈ బావిలో సుమారు పది అడుగుల లోతు మేరకు నీరు ఉంది. ముందుగా ఎస్.కోట ఎక్సైజ్ కానిస్టేబుల్ జైరామ్‌నాయుడు బావిలో దిగి మద్యం బాటిళ్లు ఉన్నట్లు గుర్తించారు. తొలుత ఆయన ఆరు మద్యం సీసాలను బయటకు తీశారు. దీంతో రెండు కిరోసిన్ ఇంజిన్లు రప్పించి నీరు పైకి తోడించారు. బాటిళ్లకు ఉన్న పై కప్పు రంగును బట్టి, అలమండ చెరువులో దొరికిన మద్యం.. ఈ మద్యం ఒక్కటేనని ఎక్సైజ్ పోలీసులు నిర్ధారణకు వచ్చారు. శుక్రవారం రాత్రి 8 గంటల వరకూ బావిలోఉన్న నీటిని తోడారు. ఇంకా నీరు ఉండడంతో అప్పటికి విరమించుకున్నారు. శనివారం ఉదయం మళ్లీ ప్రారంభించనున్నారు. అలాగే మండలంలోని చినమన్నిపాలెం సమీపంలో ఉన్న చెరువులో కూడా ఇటువంటి మద్యం బాటిళ్లు ఉన్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. సమీపంలో ఉన్న చెరువుల గట్టు వద్ద ఖాళీ మద్యం బాటిళ్లు గుట్టలుగుట్టలుగా పడి ఉండడం ఈ అనుమానాలకు మరింత ఊతమిస్తోంది. విజయనగరం ఎక్సైజ్ సూపరింటెండెంట్ పి.శ్రీధర్, ఏఈఎస్ కె.వెంకటరామిరెడ్డి, కొత్తవలస ఎక్సైజ్ సీఐ రాఘవయ్య, టాస్కుఫోర్స్ సూపరింటెండెంట్ ఆచారి, ఎన్ఫోర్స్మెంట్ సీఐ శ్రీధర్, ఫ్లయింగ్ స్క్వాడ్ ఏఎస్సై సయ్యద్ జియాఉద్దీన్, వీఆర్వో రాధాకృష్ణ ఆధ్వర్యంలో గాలింపు చర్యలు చేపడుతున్నారు. -
అలమండలో హత్య?
అలమండ(జామి), న్యూస్‌లైన్ : మండలంలోని అలమండలో వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఇది హత్యేనని సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్థానికులు, మృతుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... అలమండ గ్రామానికి చెందిన బూసర్ల రాధ అప్పలనాయుడు(40) మంగళవారం రాత్రి అదే గ్రామంలోని గేదెల సన్నిబాబు అనే రైతు పొలానికి అప్పలరాజు చెరువు పెద్ద మదుము ద్వారా వచ్చే కాలువ నీటిని ఆయిల్ ఇంజన్ ద్వారా తోడడానికి వెళ్లాడు. రాత్రి తొమ్మిది గంటలైనా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు అతని సెల్‌ఫోన్‌కు రింగ్ చేశారు. స్పందన లేకపోవడంతో రాత్రంతా వెతికారు. బుధవారం ఉదయం అప్పలరాజు చెరువు సమీపంలో ఉన్న లగుడు అయ్యప్ప కల్లాల వద్ద దిమ్మపై అప్పలనాయుడు విగతజీవై పడి ఉండడాన్ని కొంతమంది గమనించి గ్రామస్తులకు సమాచారం అందించారు. మృతుని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతుడి తల, వీపు వెనుక, చెవి వద్ద చిన్నచిన్న గాయాలున్నాయి. శరీరంపై రక్తపు మరకలు ఉన్నాయి. పెద్ద దెబ్బలు లేకపోవడం, ఒంటిపై ఎక్కువగా రక్తం ఉండడం అనుమానాలకు తావిస్తోంది. పాతకక్షలే కారణమా... రెండేళ్లుగా మృతుడు బూసర్ల రాధ అప్పలనాయుడు కుటుంబానికి, గ్రామానికి చెందిన పోలిపర్తి కృష్ణ, మిడతాన అప్పారావు, ఈదుబిల్లి వెంకటరావు, లగుడు చంద్రయ్య, మల్లయ్యల మధ్య వివాదం ఉంది. అప్పలనాయుడు కల్లం గ్రామ శివారులో ఉంది. ఆయన కల్లం పక్కనే మిగతా వారి కల్లాలు ఉన్నాయి. కల్లానికి ఆనుకుని ఉన్న మదుము పక్కన చింతచెట్టు ఉంది. ఈ చింత చెట్టు తమదంటే తమదంటూ వీరి మధ్య నిత్యం వివాదం చోటుచేసుకుండేది. అప్పలనాయుడు కుటుంబ సభ్యులు వారిపై గతంలో పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం న్యాయస్థానంలో కేసు నడుస్తోంది. ఈ కక్షతోనే వైరి వర్గం వారు తన భర్తను హత్య చేసి ఉంటారని మృతుడి భార్య లక్ష్మి, కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులకు కూడా ఈ మేరకు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా... మంగళవారం అర్ధరాత్రి మృతుడు అప్పలనాయుడు సోదరుడైన బూసర్ల కృష్ణకు, గ్రామానికి చెందిన పోలిపర్తి కృష్ణ, పైల సన్నిబాబుల మధ్య పొలానికి నీరు తోడిన విషయంలో వివాదమైంది. ఈ గొడవలో బూసర్ల కృష్ణను పారతో గాయపరిచినట్లు తెలుస్తోంది. పెద్ద దిక్కును కోల్పోయిన కుటుంబం మృతుడు అప్పలనాయుడుకు భార్య లక్ష్మితోపాటు, తొమ్మిది, ఏడేళ్ల వయస్సు గల ఇద్దరు కుమారులు ఉన్నారు. అప్పలనాయుడే కుటుంబానికి పెద్ద దిక్కు. భర్త మృతితో లక్ష్మి గుండెలవిసేలా రోదిస్తోంది. సీఐ రఘవీర్విష్ణు, ఎస్సై బి.లూథర్‌బాబు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. క్లూస్‌టీమ్ కూడా వచ్చి ఆధారాలు సేకరించింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎస్.కోట ప్రభుత్వాస్పత్రికి తరలించి, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు సీఐ రఘువీర్‌విష్ణు తెలిపారు.