రైతు ఆత్మహత్యాయత్నం
Published Wed, Dec 7 2016 11:47 PM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM
వెల్దుర్తి రూరల్: మండల కేంద్రమైన వెల్దుర్తిలో బుధవారం ఉలిందకొండకు చెందిన తెలుగు వెంకటేశ్వర్లు (35) అనే రైతు పురుగు మందు తాగి ఆత్యహత్యకు యత్నించాడు. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సమీప బంధువుల పొలం 5 ఎకరాలను కౌలుకు తీసుకుని వెంకటేశ్వర్లు వ్యవసాయం చేసేవాడు. ఈ ఖరీఫ్‌లో వేసిన కంది పంట ఎండిపోయి అప్పుల పాలయ్యాడు. తిరిగి అప్పుచేసి వెల్దుర్తి పరిసర ప్రాంతాల్లో మిరపకాయల వ్యాపారం చేసేవాడు. ఇతనికి రూ.3లక్షల వరకు అప్పులున్నట్లు సమాచారం. బుధవారం ఇంటి నుంచి బయలుదేరి వెల్దుర్తి పాతబస్టాండు సమీపంలోని తెలుగుతల్లి విగ్రహం అకస్మాత్తుగా పడిపోయాడు. అతని చేతుల్లో మద్యం బాటిల్‌తో పాటు పురుగుమందు డబ్బా కనిపించడంతో ఆత్మహత్యకు యత్నించాడని స్థానికులు గమనించారు. ట్రాఫిక్‌లో విధులు నిర్వహిస్తున్న హోంగార్డు దస్తగిరి.. 108కి ఫోన్ చేయడంతో వాహనంలో కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Advertisement
Advertisement