రామడుగు : అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా రామడుగు మండలం తిరుమలపూర్ గ్రామంలో శుక్రవారం జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన కారుపాకల రాము (40) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గత రెండేళ్లుగా వ్యవసాయంపై పెట్టిన పెట్టుబడి తిరిగి రావడం లేదు. వ్యవసాయం కోసం చేసిన అప్పులు వాటికి వడ్డీలు అధికమయ్యాయి. ఈ సంవత్సరం కూడా పంట సరిగా పండకపోవడంతో తీవ్ర ఆందోళన చెందాడు. ఆ క్రమంలో శుక్రవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.