రైతు సమస్యలను పరిష్కరించాలని బీజేపీ ధర్నా
చిన్నశంకరంపేట: రైతుల సమస్యలను పరిష్కరించాలని బీజేపీ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం చిన్నశంకరంపేట మండల బీజేపీ అధ్యక్షుడు రాజిరెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు తహసీల్దార్ కార్యాలయనికి తరలివచ్చి ధర్నా చేశారు. అనంతరం తహసీల్దార్ విజయలక్ష్మికి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు రాజిరెడ్డి మాట్లాడుతు కేంద్రం రైతులకు ఇచ్చేందుకు రూ.900 కోట్లను అందించినా రాష్ట్ర ప్రభుత్వం నిధులను రైతుల ఖాతాలో జమచేయలేదని ఆరోపించారు.
ఎన్నికలలో హామీ ఇచ్చిన రుణమాఫీ వెంటనే అమలుచేయాలని డిమాండ్ చేశారు. గతనెలలో కురిసిన వర్షాలకు పంటనష్టపోరుున రైతులకు వెంటనే పరిహారం అందించాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటుచేసి, రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు. ధర్నాలో బీజేపీ మండల ఇన్‌చార్జి సుధాకర్‌రెడ్డి, జిల్లా నాయకులు మహిపాల్‌రెడ్డి, ఎల్.సేనాపతి, ఎల్.భూపాల్, చిన్న శంకరంపేట గ్రామ అధ్యక్షుడు మంగళి యాదగిరి, మండల నాయకులు సురేష్, యాదగిరి, క్రిష్ణ, సిద్దు, ఎన్.సిద్దిరాములు, పోచం పాల్గొన్నారు.