Chinna Shankarampet
-
రైతు సమస్యలను పరిష్కరించాలని బీజేపీ ధర్నా
చిన్నశంకరంపేట: రైతుల సమస్యలను పరిష్కరించాలని బీజేపీ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం చిన్నశంకరంపేట మండల బీజేపీ అధ్యక్షుడు రాజిరెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు తహసీల్దార్ కార్యాలయనికి తరలివచ్చి ధర్నా చేశారు. అనంతరం తహసీల్దార్ విజయలక్ష్మికి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు రాజిరెడ్డి మాట్లాడుతు కేంద్రం రైతులకు ఇచ్చేందుకు రూ.900 కోట్లను అందించినా రాష్ట్ర ప్రభుత్వం నిధులను రైతుల ఖాతాలో జమచేయలేదని ఆరోపించారు. ఎన్నికలలో హామీ ఇచ్చిన రుణమాఫీ వెంటనే అమలుచేయాలని డిమాండ్ చేశారు. గతనెలలో కురిసిన వర్షాలకు పంటనష్టపోరుున రైతులకు వెంటనే పరిహారం అందించాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటుచేసి, రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు. ధర్నాలో బీజేపీ మండల ఇన్చార్జి సుధాకర్‌రెడ్డి, జిల్లా నాయకులు మహిపాల్‌రెడ్డి, ఎల్.సేనాపతి, ఎల్.భూపాల్, చిన్న శంకరంపేట గ్రామ అధ్యక్షుడు మంగళి యాదగిరి, మండల నాయకులు సురేష్, యాదగిరి, క్రిష్ణ, సిద్దు, ఎన్.సిద్దిరాములు, పోచం పాల్గొన్నారు. -
'భవానీగా ఉంటే.. అదోలా ఉండేది'
- పాఠశాలకు వచ్చిన భానుతో స్నేహితుల ముచ్చట్లు - పూర్వ విద్యార్థికి ఆసరా అందించిన ఉపాధ్యాయులు చిన్నశంకరంపేట: 'అమ్మాయిలా పెరిగినప్పటికీ వారితో స్నేహంగా ఉండాలంటే ఇబ్బం దిగా ఉండేది.. అదే అబ్బాయిలతో చనువుగా ఉండేందుకు ఇష్టపడేవాడిని'అని చిన్నశంకరంపేటకు చెందిన భవాని అలియాస్ భానుప్రసాద్ తెలిపాడు. ఇన్నాళ్లు అమ్మాయిగా పె రిగి.. ఇప్పుడు అబ్బాయిగా మారిన సందర్భంగా భానుప్రసాద్ బుధవారం చిన్నశంకరంపేటలో 'సాక్షి'తో తన అంతరంగాన్ని పం చుకున్నాడు. ఆమె అతడుగా మారిన వైనం వివరాల్లోకి వెళితే.. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మదిర గ్రామం భాగిర్తిపల్లికి చెందిన నాగులు, భాగ్యమ్మ దంపతులకు 17 ఏళ్ల క్రి తం బిడ్డపుట్టగా.. శరీరతీరును చూసి పాప గా నిర్ధారించుకున్నారు. భవాని అని పేరు పెట్టి బడికి పంపించారు. అయితే వయసు పెరుగుతున్న కొద్దీ ఆడపిల్ల లక్షణాలు కరువయ్యాయి. అయితే, నెల రోజుల క్రితం కడుపులో నొప్పి రావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లగా అసలు విషయం బయటపడింది. భవానీ అమ్మాయి కాదు అబ్బాయి అని డాక్టర్లు తేల్చారు. జన్యుపరమైన లోపాల కారణంగా అంగం కడుపులోనే ఉండిపోవడంతో ఇన్నాళ్లు అందరూ అమ్మాయిగా భావించారని, శస్త్రచికిత్స చేసి అబ్బాయిగా మార్చాలని చెప్పడంతో భవానీతో పాటు.. బంధువులం తా నిర్ఘాంతపోయారు. దీంతో హైదరాబాద్‌లోని వాసవీ ఆస్పత్రిలో నెల రోజుల క్రితం శస్త్ర చికిత్స చేశారు. తర్వాత భవాని కాస్త భానుప్రసాద్‌గా మారాడు. బుధవారం భానుప్రసాద్ మాట్లాడుతూ ‘అమ్మాయిగా పెరిగినప్పటికీ నా ఇష్టాలన్నీ అబ్బాయిలాగే ఉండేవి. జడ వేసుకున్నా పూలు పెట్టుకునేందుకు ఇష్టపడేవాడిని కాదు. బొట్టు కూడా అంతంత మాత్రమే పెట్టుకునేవాడిని. పదోతరగతికి వచ్చేసరికి అమ్మాయిల కన్నా అబ్బాయిలతోనే స్నేహం చేయాలనిపించేది. తరగతి గదిలో అమ్మాయిల పక్కన కూర్చున్నప్పటికీ వారికి దూరంగా ఉండేందుకు ప్రయత్నించేవాడిని. వారితో ఫ్రెండ్లీగా ఉన్నప్పుడు నాలో అలజడి రేగేది’ అని వివరించాడు. అ బ్బాయిలతో స్నేహం చేయడాన్ని ఉపాధ్యాయురాళ్లు తప్పుపడుతూ చీవాట్లు పెట్టేవారన్నాడు. మరిన్ని శస్త్ర చికిత్సలు అవసరమని డాక్టర్లు చెప్పారని, అవసరమైన వైద్య చేయించుకునేందుకు దాతల సాయం కోసం చూస్తున్నానని, దాతలు సహాయం చేయాల ని ఈ సందర్భంగా భవానీప్రసాద్ కోరుతున్నాడు. చీవాట్లు పెట్టేదాన్ని.. అబ్బాయిలతో స్నేహం అంత మంచిదికాదని భవానీని చీవాట్లు పెట్టేదాన్ని. పదోతరగతిలోకి వచ్చేసరికి భవాని అబ్బాయిల డ్రెస్‌లు వేసుకోవడం, వారితో కలసి డ్యాన్స్ చేయడాన్ని నేను తట్టుకోలేకపోయా. చీవాట్లు పెడితే నన్ను కోపంగా చూసేది. ఇప్పుడు చూస్తే అప్పుడు భవాని (భానుప్రసాద్) చేసింది కరెక్టేనని అనిపిస్తుంది. - ఏసుమణి, ఉపాధ్యాయురాలు, జెడ్పీహెచ్ఎస్ ఉపాధ్యాయుల ఆర్థికసాయం భానుప్రసాద్ తాను చదువుకున్న చిన్నశంకరంపేట జెడ్పీ ఉన్నత పాఠశాలకు బుధవారం వెళ్లాడు. అక్కడి ఉపాధ్యాయులతో తన అనుభవాన్ని పంచుకున్నాడు. అతని ప రిస్థితిని చూసి చలించిపోయిన ప్రధానోపాధ్యాయురాలు స్వరూపరాణి రూ.3,000, జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ రూ.1,100 ఆర్థిక సహాయం అందించారు. -
ఇద్దరక్కచెల్లెళ్లు ఉయ్యాలో..
చిన్నశంకరంపేట: ఇద్దరక్క చెల్లెళ్లు ...ఉయ్యాలో ఒక్కూరికిచ్చినారు...ఉయ్యాలో..ఒక్కడే మాఅన్న...ఉయ్యాలో..వచ్చన్నపోడే ఉయ్యాలో అంటూ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి మహిళలతో కలిసి బతుకమ్మ ఆడి పాడారు. సోమవారం చిన్నశంకరంపేట మండల కేంద్రంలో ప్రభుత్వం తరఫున నిర్వహించిన బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొన్న ఆమె మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా తనకిష్టమైన బతుకమ్మ పాటను పాడి మహిళలతో కలిసి పోయారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ మన సంప్రదాయలు, సంస్కృతులకు సమైక్య రాష్ట్రంలో సరైన గౌరవం దక్కలేదని అందుకే బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించి ముఖ్యమంత్రి కేసీఆర్ సరైన గౌరవం కల్పించారన్నారు. ఇది తెలంగాణ మహిళలకు దక్కిన అరుదైన గౌరవమన్నారు. మన సంస్కృతి, మన సంప్రదాయాలను మన ప్రభుత్వం అరుదైన గౌరవం కల్పించేందుకు సిద్ధంగా ఉందన్నారు. కార్యక్రమంలో చిన్నశంకరంపేట ఎంపీపీ అధ్యక్షురాలు కృపావతి, జెడ్పీటీసీ స్వరూప, ఉపాధ్యక్షురాలు బుజ్జి,మాజీ సర్పంచ్ విజయలక్ష్మి, సర్పంచ్‌లు కుమార్‌గౌడ్,ే హమలత, మాధవి,శోభ, ప్రియా నాయక్, రంగారావు,సత్యనారాయణ,మూర్తి పెద్దులు, అంజయ్య, ఎంపీడీఓ రాణి, తహశీల్దార్ నిర్మల, ఐకేపీ ఏపీఎం ఇందిర, టీఆర్ఎస్ నాయకులు లకా్ష్మరెడ్డి,ర ామ్రెడ్డి, రాజు,నరేందర్,రమేష్‌గౌడ్ పాల్గొన్నారు. శుద్ధమైన నీటితోనే ఆరోగ్యం మెదక్‌రూరల్: శుద్ధి చేసిన నీరు ఆరోగ్యానికి ఎంతో మంచిదని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు. మండల పరిధిలోని బ్యాతోల్ గ్రామ ప్రజలకు పరిశుభ్రమైన తాగునీరందించేందుకు బాలవికాస్ స్వచ్ఛంద సంస్థ నీటి శుద్ధి కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ కేంద్రానికి సోమవారం డిప్యూటీ స్పీకర్ ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ బాలవికాస్ సంస్థ ఆధ్వర్యంలో మారుమూల గ్రామ ప్రజలకు నీటి శుద్ధి కేంద్రం ఏర్పాటు చేసి తాగునీటిని అందించడం హర్షించదగ్గ విషయమన్నారు. ప్రజల భాగస్వామ్యంతో ఏర్పాటు చేస్తున్న నీటి శుద్ధి కేంద్రాల వల్ల డయేరియా, కలరా తదితర వ్యాధులు దరిచేరవని ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ లావణ్యరెడ్డి, ఎంపీపీ లక్ష్మీ కిష్టయ్య, బాలవికాస్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి శ్రీనివాస్, గ్రామ సర్పంచ్ సువర్ణ నారంరెడ్డి, మెదక్ మున్సిపల్ వైస్ చైర్మన్ రాగి అశోక్, నాయకులు జయరాంరెడ్డి, అంజాగౌడ్, కిష్టయ్య, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పాదచారులపై దూసుకెళ్లిన ట్రాక్టర్
చిన్నశంకరంపేట, న్యూస్‌లైన్ : పశువులను మేత కోసం గ్రామ పొలిమేరల్లో వదలి ఇంటికి వెళుతున్న ఇద్దరు యువకులను ట్రాక్టర్ ఢీకొనడం తో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు మృత్యువుతో పోరాడుతున్నాడు. ఈ సంఘటన మండలంలోని గవ్వలపల్లి గ్రామంలో గురువారం ఉద యం చోటు చేసుకుంది. గ్రామస్తుల కథ నం మేరకు.. గ్రామానికి చెందిన బోగు డం కిషన్, యాదమ్మ దంపతుల ఏకైక కుమారుడు ప్రశాంత్ (21), మాడబోయిన మల్లేశం కుమారుడు యాదగిరిలు ఉదయం తమతమ పశువులను గ్రామ శివారులోని జంగిట్లో అప్పగించి ఇంటికి బయలుదేరారు. అయితే వీరు గవ్వలప ల్లి- జంగరాయి రోడ్డుపై వస్తుండగా వె నుక నుంచి వేగంగా వచ్చిన ట్రాక్టర్ వీరి ని ఢీకొంది. ఈ సంఘటనలో ప్రశాంత్ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో యువకుడు యాదగిరి తలకు తీవ్రగాయమైంది. దీంతో స్థానికులు అతడిని చికిత్స నిమిత్తం మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చి కిత్సల అనంతరం సికింద్రాబాద్‌లోని ఓ ప్రై వే టు ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఎస్ఐ కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఒక్కగానొక్క కుమారుడు.. ఉన్న ఒక్కడివి పోతే మేమెలా బతకాలిరా.. అంటూ ప్రశాంత్ తల్లిదండ్రులు రోదించడం అక్కడి వారిని కలిచివేసిం ది. పశువులను జంగిట్లో అప్పగించి వ స్తాడని అనుకున్నాం.. కానీ ఇలా జరుగుతుందని ఊహించలేదని విలపించారు.