చిన్నశంకరంపేట: ఇద్దరక్క చెల్లెళ్లు ...ఉయ్యాలో ఒక్కూరికిచ్చినారు...ఉయ్యాలో..ఒక్కడే మాఅన్న...ఉయ్యాలో..వచ్చన్నపోడే ఉయ్యాలో అంటూ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి మహిళలతో కలిసి బతుకమ్మ ఆడి పాడారు. సోమవారం చిన్నశంకరంపేట మండల కేంద్రంలో ప్రభుత్వం తరఫున నిర్వహించిన బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొన్న ఆమె మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు.
ఈ సందర్భంగా తనకిష్టమైన బతుకమ్మ పాటను పాడి మహిళలతో కలిసి పోయారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ మన సంప్రదాయలు, సంస్కృతులకు సమైక్య రాష్ట్రంలో సరైన గౌరవం దక్కలేదని అందుకే బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించి ముఖ్యమంత్రి కేసీఆర్ సరైన గౌరవం కల్పించారన్నారు. ఇది తెలంగాణ మహిళలకు దక్కిన అరుదైన గౌరవమన్నారు. మన సంస్కృతి, మన సంప్రదాయాలను మన ప్రభుత్వం అరుదైన గౌరవం కల్పించేందుకు సిద్ధంగా ఉందన్నారు.
కార్యక్రమంలో చిన్నశంకరంపేట ఎంపీపీ అధ్యక్షురాలు కృపావతి, జెడ్పీటీసీ స్వరూప, ఉపాధ్యక్షురాలు బుజ్జి,మాజీ సర్పంచ్ విజయలక్ష్మి, సర్పంచ్‌లు కుమార్‌గౌడ్,ే హమలత, మాధవి,శోభ, ప్రియా నాయక్, రంగారావు,సత్యనారాయణ,మూర్తి పెద్దులు, అంజయ్య, ఎంపీడీఓ రాణి, తహశీల్దార్ నిర్మల, ఐకేపీ ఏపీఎం ఇందిర, టీఆర్‌ఎస్ నాయకులు లకా్ష్మరెడ్డి,ర ామ్‌రెడ్డి, రాజు,నరేందర్,రమేష్‌గౌడ్ పాల్గొన్నారు.
శుద్ధమైన నీటితోనే ఆరోగ్యం
మెదక్‌రూరల్: శుద్ధి చేసిన నీరు ఆరోగ్యానికి ఎంతో మంచిదని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు. మండల పరిధిలోని బ్యాతోల్ గ్రామ ప్రజలకు పరిశుభ్రమైన తాగునీరందించేందుకు బాలవికాస్ స్వచ్ఛంద సంస్థ నీటి శుద్ధి కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ కేంద్రానికి సోమవారం డిప్యూటీ స్పీకర్ ప్రారంభోత్సవం చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ బాలవికాస్ సంస్థ ఆధ్వర్యంలో మారుమూల గ్రామ ప్రజలకు నీటి శుద్ధి కేంద్రం ఏర్పాటు చేసి తాగునీటిని అందించడం హర్షించదగ్గ విషయమన్నారు. ప్రజల భాగస్వామ్యంతో ఏర్పాటు చేస్తున్న నీటి శుద్ధి కేంద్రాల వల్ల డయేరియా, కలరా తదితర వ్యాధులు దరిచేరవని ఆమె పేర్కొన్నారు.
కార్యక్రమంలో జడ్పీటీసీ లావణ్యరెడ్డి, ఎంపీపీ లక్ష్మీ కిష్టయ్య, బాలవికాస్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి శ్రీనివాస్, గ్రామ సర్పంచ్ సువర్ణ నారంరెడ్డి, మెదక్ మున్సిపల్ వైస్ చైర్మన్ రాగి అశోక్, నాయకులు జయరాంరెడ్డి, అంజాగౌడ్, కిష్టయ్య, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇద్దరక్కచెల్లెళ్లు ఉయ్యాలో..
Published Tue, Sep 30 2014 12:09 AM | Last Updated on Sat, Sep 2 2017 2:07 PM
Advertisement