చిన్నశంకరంపేట, న్యూస్‌లైన్ : పశువులను మేత కోసం గ్రామ పొలిమేరల్లో వదలి ఇంటికి వెళుతున్న ఇద్దరు యువకులను ట్రాక్టర్ ఢీకొనడం తో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు మృత్యువుతో పోరాడుతున్నాడు. ఈ సంఘటన మండలంలోని గవ్వలపల్లి గ్రామంలో గురువారం ఉద యం చోటు చేసుకుంది. గ్రామస్తుల కథ నం మేరకు.. గ్రామానికి చెందిన బోగు డం కిషన్, యాదమ్మ దంపతుల ఏకైక కుమారుడు ప్రశాంత్ (21), మాడబోయిన మల్లేశం కుమారుడు యాదగిరిలు ఉదయం తమతమ పశువులను గ్రామ శివారులోని జంగిట్లో అప్పగించి ఇంటికి బయలుదేరారు.
అయితే వీరు గవ్వలప ల్లి- జంగరాయి రోడ్డుపై వస్తుండగా వె నుక నుంచి వేగంగా వచ్చిన ట్రాక్టర్ వీరి ని ఢీకొంది. ఈ సంఘటనలో ప్రశాంత్ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో యువకుడు యాదగిరి తలకు తీవ్రగాయమైంది. దీంతో స్థానికులు అతడిని చికిత్స నిమిత్తం మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చి కిత్సల అనంతరం సికింద్రాబాద్‌లోని ఓ ప్రై వే టు ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఎస్‌ఐ కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించారు.
ఒక్కగానొక్క కుమారుడు..
ఉన్న ఒక్కడివి పోతే మేమెలా బతకాలిరా.. అంటూ ప్రశాంత్ తల్లిదండ్రులు రోదించడం అక్కడి వారిని కలిచివేసిం ది. పశువులను జంగిట్లో అప్పగించి వ స్తాడని అనుకున్నాం.. కానీ ఇలా జరుగుతుందని ఊహించలేదని విలపించారు.
పాదచారులపై దూసుకెళ్లిన ట్రాక్టర్
Published Fri, Nov 15 2013 1:33 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM
Advertisement