రైతులను భిక్షగాళ్లుగా మారుస్తున్న ప్రభుత్వం
Published Fri, Jul 29 2016 12:50 AM | Last Updated on Mon, Oct 1 2018 2:11 PM
తిప్పర్తి : ఫాంహౌస్‌కే పరిమితమైన సీఎం కేసీఆర్ రుణమాఫీ చేయకుండా రైతులను భిక్షగాళ్లుగా మారుస్తున్నారని సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శించారు. రైతు రుణమాఫీకి సంబంధించి రూ. 8 వేల కోట్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ చేస్తామని, దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని, డబుల్ బెడ్‌రూం ఇళ్లు కట్టిస్తామని అబద్ధాల మాటలు చెప్పి గద్దెనెక్కిన ప్రభుత్వం హామీల అమలులో విఫలమైందన్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్లు ఎర్రబెల్లికే పరిమితం కాగా రుణమాఫీని నాలుగు విడతలుగా చేస్తామని మళ్లీ ఇప్పుడు 8 విడతల్లో చేస్తామని మాట మారుస్తోందన్నారు.
Advertisement