– పురుగులమందు తాగి కౌలురైతు బలవన్మరణం
– మేళ్లచెరువు మండలం వెల్లటూరులో ఘటన
Ðð ల్లటూరు(మేళ్లచెర్వు)
కరువుకాటుకు మరో రైతు బలయ్యాడు. పంట దిగుబడి రాక.. చేసిన అప్పులు తీర్చేమార్గం కనిపించక చావే శరణ్యమనుకుని బలవన్మరణానికి ఒడిగట్టాడు. మేళ్లచెరువు మండల పరిధిలో శుక్రవారం వెలుగు చూసిన విషాదకర ఘటన వివరాలు.. మండలంలోని వెల్లటూరు గ్రామానికి చెందిన కేతపల్లి పిచ్చయ్య (45)మూడెకరాలను కౌలుకు తీసుకుని మూడేళ్లుగా పత్తి సాగు చేస్తున్నాడు. వ్యవసాయ పెట్టుబడుల నిమిత్తం తెలిసిన వారి వద్ద రూ.4లక్షల వరకు అప్పు చేశాడు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పంట దిగుబడి ఆశాజనకంగా లేకపోవడంతో అప్పులు తీర్చే మార్గం కనిపించలేదు. ఈ నేపథ్యంలోనే గురువారం సాయంత్రం వ్యవసాయ భూమి వద్దకు వెళ్లి పురుగులమందు తాగాడు. రాత్రి ఇంటికి రాకపోవడంతో శుక్రవారం ఉదయం పొలం వద్దకు వెళ్లి చూడగా పిచ్చయ్య అపస్మారకస్థితిలో పడి ఉన్నాడు. కొనూపిరితో ఉన్న అతడిని అస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. మృతుడికి భార్యతో పాటు ఇద్దరు అమ్మాయిలు,ఇద్దరు అబ్బాయిలున్నారు. పెద్ద కూతురికి పెళ్లి కాగా చిన్నకూతురు బిటెక్ ,కుమారులు 8,10 తరగతులు చదువుతున్నారు. భార్య తిరుపతమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ.రవికుమార్ తెలిపారు.
హాలియా
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకుంటున్న మండల పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం రంగుండ్ల గ్రామానికి చెందిన ఆంగోతు పాండు(28) తనకున్న ఎకరం భూమితో పాటు మరో నాలుగు ఎకరాల వ్యవసాయభూమి కౌలుకు తీసుకుని చేస్తున్నాడు. కాగా తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా పత్తి ఎండిపోవడంతో చేసిన అప్పులు సుమారు.4.5లక్షల తీరే పరిస్థితి లేకపోవడంతో గురువారం సాయంత్రం పత్తి చేలోనే మోనోక్రోటోఫాస్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పరిసరాల్లో రైతుల చూసి సాగర్ కమలా నెహ్రూ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందాడు. మృతుడు బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసికుని దర్యాప్యు చేస్తున్నట్లు హాలియా ఎస్‌ఐ వెంకట్ తెలిపారు. మృతుడికి భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు.
హాలియా
నల్లగొండ జిల్లా హాలియా మండలం రంగుండ్ల గ్రామానికి చెందిన ఆంగోతు పాండు(28) తనకున్న ఎకరం భూమితో పాటు మరో నాలుగు ఎకరాల వ్యవసాయభూమిని కౌలుకు తీసుకుని పత్తి సాగు చేస్తున్నాడు. పెట్టుబడులు, కుటుంబ అవసరాల నిమిత్తం 4.5 లక్షలు అప్పు చేశాడు. వర్షాభావ పరిస్థితులకు పత్తి చేను ఎండిపోవడంతో మనస్తాపానికి గురయ్యాడు. ఈ నేపథ్యంలోనే గురువారం పత్తిచేలోనే పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు.
తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా పత్తి ఎండిపోవడంతో చేసిన అప్పులు సుమారు.4.5లక్షల తీరే పరిస్థితి గురువారం సాయంత్రం పత్తి చేలోనే మోనోక్రోటోఫాస్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పరిసరాల్లో రైతుల చూసి సాగర్ కమలా నెహ్రూ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందాడు. మృతుడు బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసికుని దర్యాప్యు చేస్తున్నట్లు హాలియా ఎస్‌ఐ వెంకట్ తెలిపారు. మృతుడికి భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు.
అప్పుతీర్చే మార్గం కనిపించక..
Published Sat, Aug 27 2016 12:38 AM | Last Updated on Mon, Oct 1 2018 2:11 PM
Advertisement