festicides
-
పెరటితోటలో పేనుబంకను వదిలించేదెలా?
మీ గార్డెన్లో పేనుబంక (అఫిడ్స్)ను నియంత్రించటం ఒక సవాలుతో కూడుకున్న పని. కానీ, పేనుబంక పురుగులను అదుపు చేయటానికి అనేక ప్రభావవంతమైన మార్గాలు ఉన్నాయి. మీరు అనుసరించగల కొన్ని సూచనలు:1. మీ మొక్కలను క్రమం తప్పకుండా తనిఖీ చేయండిముడుచుకున్న ఆకులపై అంటుకునే పదార్థం లేదా స్టెమ్ లేదా ఆకులపై పేనుబంక సోకుతున్న సంకేతాలు ఏమైనా ఉన్నాయేమో గమనించటం కోసం మీ మొక్కలను తరచుగా తనిఖీ చేయండి. 2. వేపనూనె వాడండి వేప నూనె అఫిడ్స్‌ను నియంత్రిండానికి వాడే సహజమైన పురుగుమందు. లేబుల్ సూచనల ప్రకారం వేప నూనెను నీటితో కలిపి పేనుబంక సోకిన మొక్కలపై పిచికారీ చేయండి. 3.సబ్బు నీరు స్ప్రే చేయండిపేనుబంకను నియంత్రించడానికి తేలికపాటి డిష్ సోప్‌ను నీటిలోకలిపి ప్రభావిత మొక్కలపై స్ప్రే చేయవచ్చు.4. గార్లిక్ స్ప్రే ఉపయోగించండివెల్లుల్లి సహజ క్రిమిసంహారక లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది పేనుబంకను నియంత్రించడంలో సహాయ పడుతుంది. వెల్లుల్లి రసాన్ని నీటితో కలపండి. ప్రభావిత మొక్కలపై పీచికారీ చేయండి.5. ప్రయోజనకరమైన కీటకాలులేడీబగ్స్, లేస్వింగ్, పరాన్నజీవి కందిరీగలు వంటి ప్రయోజనకరమైన కీటకాలు పేనుబంకను వేటాడతాయి. అఫిడ్స్ పురుగుల సంతతిని నియంత్రించడానికి మీ గార్డెన్ లో ఈ కీటకాలు పెరిగేలా చూసుకోండి.6. తోట పరిశుభ్రత పాటించండికలుపు మొక్కలను తొలగించండి. తెగులు సోకిన మొక్కలను తీసి దూరంగా పారవేయండి. పురుగుల ముట్టడిని నివారించడానికి ఎక్కువ ఎరువులు వేయకుండా ఉండండి.7. స్క్రీన్లు, రో కవర్లను ఉపయోగించండిఅఫిడ్స్ మీ మొక్కలను ఆశించకుండా నిరోధించడానికి ఫైన్–మెష్ స్క్రీన్లు లేదా ఫైన్–వెటెడ్ రో కవర్లను ఉపయోగించండి.8.జీవ నియంత్రణపేనుబంకను తినే పక్షులు, సాలె పురుగులు వంటి సహజ మాంసాహారులను ప్రోత్సహించటం ద్వారా జీవ నియంత్రణకు అవకాశం కల్పించండి.9. పర్యవేక్షించండి, పునరావృతం చేయండి మీ గార్డెన్లో మొక్కలను క్రమం తప్పకుండా పర్యవేక్షించండి. పేనుబంకను సమర్థవంతంగా అరికట్టే నియంత్రణ చర్యలను అవసరాన్ని బట్టి పునరావృతం చేయండి.– హేపీ గార్డెనర్స్ అడ్మిన్ టీం -
నాట్కో సీటీపీఆర్‌కు తొలగిన అడ్డంకి, షేర్లు జూమ్
హైదరాబాద్: క్లోరంట్రానిలిప్రోల్ (సీటీపీఆర్) పురుగు మందులను భారత మార్కెట్లో ప్రవేశ పెట్టేందుకు నాట్కో ఫార్మాకు అడ్డంకి తొలగిపోయింది. ఢిల్లీ హైకోర్టు నుంచి ఈ మేరకు కంపెనీ ఉపశమనం పొందింది. సీటీపీఆర్ విషయంలో నాట్కో ఫార్మా పేటెంట్ ఉల్లంఘనకు పాల్పడిందంటూ యూఎస్‌కు చెందిన ఎఫ్ఎంసీ కార్పొరేషన్ గతంలో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. కాగా, సీటీపీఆర్‌ను దేశీయంగా తయారు చేయడం కోసం సెంట్రల్ ఇన్సెక్టిసైడ్ బోర్డ్, రిజిస్ట్రేషన్ కమిటీ నుండి అనుమతి పొందిన తొలి కంపెనీ తామేనని నాట్కో సోమవారం తెలిపింది. వివిధ పంటల్లో వచ్చే తెగులు నివారణకు ఈ పురుగు మందును వాడతారు. సీటీపీఆర్ ఆధారిత ఉత్పత్తుల విపణి భారత్‌లో సుమారు రూ.2,000 కోట్లు ఉంటుందని నాట్కో వెల్లడించింది. త్వరలో ఈ ఉత్పత్తులను ప్రవేశపెడతామని కంపెనీ ప్రకటించింది. ఈ వార్తలతో నాట్కో ఫార్మా షేరుపై ఇన్వెస్టర్ల ఆసక్తి నెలకింది. మంగళవారం ఉదయం ఈ షేరు రూ. 16.95 లేదా 3 శాతం పెరిగి రూ.654 వద్ద ఉంది. -
అప్పుతీర్చే మార్గం కనిపించక..
– పురుగులమందు తాగి కౌలురైతు బలవన్మరణం – మేళ్లచెరువు మండలం వెల్లటూరులో ఘటన Ðð ల్లటూరు(మేళ్లచెర్వు) కరువుకాటుకు మరో రైతు బలయ్యాడు. పంట దిగుబడి రాక.. చేసిన అప్పులు తీర్చేమార్గం కనిపించక చావే శరణ్యమనుకుని బలవన్మరణానికి ఒడిగట్టాడు. మేళ్లచెరువు మండల పరిధిలో శుక్రవారం వెలుగు చూసిన విషాదకర ఘటన వివరాలు.. మండలంలోని వెల్లటూరు గ్రామానికి చెందిన కేతపల్లి పిచ్చయ్య (45)మూడెకరాలను కౌలుకు తీసుకుని మూడేళ్లుగా పత్తి సాగు చేస్తున్నాడు. వ్యవసాయ పెట్టుబడుల నిమిత్తం తెలిసిన వారి వద్ద రూ.4లక్షల వరకు అప్పు చేశాడు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పంట దిగుబడి ఆశాజనకంగా లేకపోవడంతో అప్పులు తీర్చే మార్గం కనిపించలేదు. ఈ నేపథ్యంలోనే గురువారం సాయంత్రం వ్యవసాయ భూమి వద్దకు వెళ్లి పురుగులమందు తాగాడు. రాత్రి ఇంటికి రాకపోవడంతో శుక్రవారం ఉదయం పొలం వద్దకు వెళ్లి చూడగా పిచ్చయ్య అపస్మారకస్థితిలో పడి ఉన్నాడు. కొనూపిరితో ఉన్న అతడిని అస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. మృతుడికి భార్యతో పాటు ఇద్దరు అమ్మాయిలు,ఇద్దరు అబ్బాయిలున్నారు. పెద్ద కూతురికి పెళ్లి కాగా చిన్నకూతురు బిటెక్ ,కుమారులు 8,10 తరగతులు చదువుతున్నారు. భార్య తిరుపతమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ.రవికుమార్ తెలిపారు. హాలియా అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకుంటున్న మండల పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం రంగుండ్ల గ్రామానికి చెందిన ఆంగోతు పాండు(28) తనకున్న ఎకరం భూమితో పాటు మరో నాలుగు ఎకరాల వ్యవసాయభూమి కౌలుకు తీసుకుని చేస్తున్నాడు. కాగా తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా పత్తి ఎండిపోవడంతో చేసిన అప్పులు సుమారు.4.5లక్షల తీరే పరిస్థితి లేకపోవడంతో గురువారం సాయంత్రం పత్తి చేలోనే మోనోక్రోటోఫాస్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పరిసరాల్లో రైతుల చూసి సాగర్ కమలా నెహ్రూ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందాడు. మృతుడు బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసికుని దర్యాప్యు చేస్తున్నట్లు హాలియా ఎస్ఐ వెంకట్ తెలిపారు. మృతుడికి భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు. హాలియా నల్లగొండ జిల్లా హాలియా మండలం రంగుండ్ల గ్రామానికి చెందిన ఆంగోతు పాండు(28) తనకున్న ఎకరం భూమితో పాటు మరో నాలుగు ఎకరాల వ్యవసాయభూమిని కౌలుకు తీసుకుని పత్తి సాగు చేస్తున్నాడు. పెట్టుబడులు, కుటుంబ అవసరాల నిమిత్తం 4.5 లక్షలు అప్పు చేశాడు. వర్షాభావ పరిస్థితులకు పత్తి చేను ఎండిపోవడంతో మనస్తాపానికి గురయ్యాడు. ఈ నేపథ్యంలోనే గురువారం పత్తిచేలోనే పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా పత్తి ఎండిపోవడంతో చేసిన అప్పులు సుమారు.4.5లక్షల తీరే పరిస్థితి గురువారం సాయంత్రం పత్తి చేలోనే మోనోక్రోటోఫాస్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పరిసరాల్లో రైతుల చూసి సాగర్ కమలా నెహ్రూ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందాడు. మృతుడు బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసికుని దర్యాప్యు చేస్తున్నట్లు హాలియా ఎస్ఐ వెంకట్ తెలిపారు. మృతుడికి భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు. -
భార్య పుట్టింటికి వెళ్లిందని..
పాల్వంచ(ఖమ్మం): భార్య పుట్టింటికి వెళ్లిందని మనస్తాపానికి గురైన ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా పాల్వంచ మండలం నాగారంలో సోమవారం రాత్రి వెలుగుచూసింది. గ్రామానికి చెందిన పి. శ్రీను(26)కు రెండేళ్ల క్రితం వివాహమైంది. ఈ మధ్య కాలంలో తాగుడికి బానిసైన శ్రీను భార్యతో గొడవపడుతుండటంతో.. విసిగి వేసారిన ఆమె ఈ రోజు పుట్టింటికి వెళ్లింది. దీంతో మనస్తాపానికి గురైన శ్రీను పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.