నల్లగొండ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ వద్ద రైతులు ఆందోళనకు దిగారు
నల్లగొండ: నల్లగొండ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ వద్ద రైతులు ఆందోళనకు దిగారు. కందులు కొనకుండా అధికారులు మార్కెట్‌కు తాళం వేయడంతో పంట అమ్ముకోవడానికి వచ్చిన రైతులు ఆందోళన చేస్తూ.. మార్కెట్ ముందు ధర్నా చేపట్టారు. ఈ అంశంపై మార్కెట్ అధికారులను సంప్రదించగా.. గన్నీబ్యాగుల కొరత ఉండటంతోనే కొనుగోళ్లు నిలిపివేసామని తెలిపారు. సుదూరప్రాంతాల నుంచి పంటతో మార్కెట్ కు వచ్చిన రైతులు నానా అవస్థలు పడుతున్నారు.