విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ ముట్టడి | farmers roundup substation | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ ముట్టడి

Published Tue, Oct 18 2016 1:42 AM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM

విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ ముట్టడి - Sakshi

విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ ముట్టడి

 
  • వ్యవసాయానికి మూడు షిప్టుల సరఫరాపై రైతుల నిరసన 
 
సూళ్లూరుపేట: వ్యవసాయానికి మూడు షిప్టులుగా విద్యుత్‌ను సరఫరా చేయడాన్ని నిరసిస్తూ మండలంలోని మంగానెల్లూరు సబ్‌స్టేషన్‌ను సోమవారం రాత్రి ముట్టడించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గత కొద్ది రోజులుగా వేకువజామున 3.45 నుంచి ఉదయం 10.45 గంటల వరకు ఒక షిప్టు, ఉదయం 10.45 నుంచి సాయంత్రం 5.45వరకు మరో షిప్టు కింద ఏడు గంటల కరెంట్‌ ఇస్తూ వస్తున్నారని తెలిపారు. రెండు రోజులుగా విద్యుత్‌ శాఖ అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా మూడో షిప్టు కింద రాత్రి 8.45 గంటల నుంచి వేకువజామున 3.45 గంటల వరకు ఇస్తున్నారని వివరించారు. దీంతో రాత్రి వేళల్లో ´పొలాÌల్లో జాగారం చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు షిప్టుల కరెంట్‌ను కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. మూడో షిఫ్టును రద్దు చేయకపోతే ఏడీఈ, ఏఈ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దామానెల్లూరు, మంగానెల్లూరు, సుగ్గుపల్లి, ఉగ్గుమూడి, మతకామూడి, వెలగలపొన్నూరు, తుంగమడగు రైతులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement