నూజివీడు: కృష్ణాజిల్లా నూజివీడులో దారుణం చోటుచేసుకుంది. స్థానిక అజరయ్యపేటలో మైనర్ అయిన తన కుమార్తెపై కన్న తండ్రే ఏడాదిగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు. వివరాలు.. తొమ్మండ్రు వెంకటేశ్వరరావుకు ఇద్దరు కుమార్తెలు. పెయింటింగ్ పనులు చేసుకుంటున్నాడు. భార్య కూడా ఇళ్లల్లో పనులు చేస్తూ ఉంటుంది. పెద్ద కుమార్తె పదో తరగతి చదువుతుండగా రెండో కుమార్తెకు మతిస్థిమితం లేనందున ఇంట్లోనే ఉంటోంది. తాగుడుకు బానిస అయిన తండ్రి ఇంట్లోనే ఉంటున్న రెండో కుమార్తెపై ఏడాది కాలంగా అత్యాచారం చేస్తున్నాడు.
ఈ విషయం పెద్ద కుమార్తె ద్వారా తెలుసుకున్న తల్లి తాను పనిచేస్తున్న ఓ న్యాయవాదికి చెప్పుకుంది. వెంటనే ఆయన శనివారం ఉదయం నూజివీడు పోలీసులకు సమాచారం అందించారు. బాధితురాలి తల్లి, సోదరి నిందితుడిపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. బాధితురాలిని వైద్యపరీక్షలకు తరలించారు. నిందితుడిపై పోలీసులు ఫోక్సా చట్టం కింద కేసు నమోదు చేశారు. తండ్రి పరారయ్యాడు.
నూజివీడులో దారుణం
Published Sat, Feb 18 2017 8:38 AM | Last Updated on Mon, Jul 23 2018 8:49 PM
Advertisement
Advertisement