కుమారున్నిహతమార్చిన తండ్రి | Father Allegedly Kills his son For Objecting To Love Marriage | Sakshi
Sakshi News home page

కుమారున్నిహతమార్చిన తండ్రి

Published Sat, Oct 8 2016 11:48 AM | Last Updated on Mon, Jul 29 2019 5:43 PM

Father Allegedly Kills his son For Objecting To Love Marriage

చిన్నకొండూర్: తనకు ఇష్టంలేని వివాహం చేసుకున్నాడనే నెపంతో కుమారున్నితండ్రి కర్రతో కొట్టి చంపాడు.  మెదక్ జిల్లా చిన్నకొండూర్‌లో శనివారం ఉదయం ఈ దారుణం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నాగరాజు కుమారుడు నరేష్(30) ఇటీవల ఓ యువతిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు.

అయితే, ఇది తండ్రికి నచ్చలేదు. కొన్ని రోజులుగా ఇదే విషయమై కుటుంబసభ్యుల మధ్య గొడవ జరుగుతోంది. శనివారం ఉదయం కూడా తండ్రి, కొడుకు వాగ్వాదానికి దిగారు. కోపంతో ఊగిపోయిన నాగరాజు కొడుకు నరేష్‌ను కర్రతో గట్టిగా తలపై కొట్టాడు. తీవ్రంగా గాయపడిన నరేష్ అపస్మారక స్థితికి చేరుకున్నాడు. ఆస్పత్రికి తీసుకెళ్తుండగానే  అతడు చనిపోయాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement