వరంగల్ : వరంగల్ కురువి పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం తెల్లవారుజామున విషాదం చోటు చేసుకుంది. గుర్తు తెలియని వాహనం ఢీకొని తండ్రీకూతుళ్లు మరణించారు. ఈ దుర్ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహలను స్వాధీనం చేసుకున్నారు.
పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహాలను ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. క్రిస్మస్ పర్వదినం నేపథ్యంలో చర్చిలో ప్రార్థనలు ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.