తాగుడుకు బానిసైన ఓ తండ్రి.. కన్న కొడుకులనే అమ్మాకానికి పెట్టాడు. పోలీసులు కలగ జేసుకోవడంతో కథ సుఖాంతమైంది. వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ జిల్లా ఇరుకుల్ల గ్రామానికి చెందిన మల్లేశ్ తాగుడుకు బానిసయ్యాడు. దీంతో అతడి భార్య అతడిని వదిలేసింది. ఈ క్రమంలో తన ఇద్దరు కుమారులను బేరానికి పెట్టాడు. లక్షరూపాయల బేరం కుదుర్చుకున్న అతడు.. 20 వేల రూపాయలను అడ్వాన్స్ గా తీసుకున్నాడు. విషయం తెలిసిన అతడి భార్య పోలీసులను ఆశ్రయించింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మల్లేశ్ ను అరెస్టు చేసి.. కేసు నమోదు చేశారు.