డబ్బు కోసం కన్నబిడ్డనే అమ్మేశాడు | Father sells his son for money | Sakshi
Sakshi News home page

డబ్బు కోసం కన్నబిడ్డనే అమ్మేశాడు

Published Sun, Jul 3 2016 4:21 PM | Last Updated on Mon, Sep 4 2017 4:03 AM

Father sells his son for money

సైదాపూర్ (కరీంనగర్ జిల్లా) : సైదాపూర్ మండల కేంద్రంలో దారుణం చోటుచేసుకుంది. డబ్బుల కోసం కన్నకొడుకునే అమ్మేశాడో తండ్రి. సైదాపూర్‌కు చెందిన జయరాజ్(35), హైమ(28) భార్యాభర్తలు. 20 రోజుల క్రితం హైమకు హైదరాబాద్‌లో డెలివరీ అయింది. బిడ్డ పుట్టగానే చనిపోయాడని తల్లికి చెప్పి డబ్బు కోసం బిడ్డను ఓ వ్యక్తికి అమ్మేశాడు జయరాజ్. ఈ విషయం ఆదివారం జయరాజ్ వేరొక వ్యక్తితో మాట్లాడుతుండగా హైమా వినింది. విషయం తెలిసి సైదాపూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement