ఏలూరు (పశ్చిమ గోదావరి) : ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనకు బందోబస్తు నిర్వహిస్తున్న మహిళా ఏఎస్సై, కానిస్టేబుల్లు వడదెబ్బకు గురై స్పృహ తప్పి పడిపోయారు. ఈ సంఘటన పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో శనివారం చోటుచేసుకుంది. జిల్లాలో నేడు ముఖ్యమంత్రి పర్యటన ఉండటంతో మహిళా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఏఎస్సై విజయలక్ష్మితో పాటు మరో మహిళా కానిస్టేబుల్ వడదెబ్బకు గురయ్యారు. ఇది గుర్తించిన తోటి పోలీసులు వారిని ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.