Published
Wed, Aug 3 2016 11:21 PM
| Last Updated on Mon, Sep 4 2017 7:40 AM
బాలాజీలో రూ.3.6లక్షల సరుకుల సీజ్
రాజాం రూరల్ : నియోజకవర్గంలోని ఎరువుల దుకాణాలపై జిల్లా ప్రత్యేక స్క్వాడ్ బృందం బుధవారం ఆకస్మిక దాడులు చేసింది. స్పెషల్ ఆఫీసర్ జి.కళ్యాణకుమార్, ప్రదీప్‌కుమార్ ఆధ్వర్యంలో సిబ్బంది వంగరలో 2, రేగిడిలో 2, రాజాంలో 2 దుకాణాలను తనిఖీ చేశారు. రాజాం పట్టణంలోని బాలాజీ ట్రేడర్స్‌లో ఓ ఫారం లేకుండా విక్రయిస్తున్న సుమారు రూ.3.6లక్షల విలువ గల ఎరువులను సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్రమంగా స్టాక్ నిల్వ ఉన్నా, స్టాక్ బోర్డులో తేడా ఉన్నా, ధరల పట్టిక బహిర్గత పర్చకపోయినా, వినియోగదారులను మోసం చేసినా సంబంధిత యజమానులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అయన వెంట రాజాం, రేగిడి, వంగర, సంతకవిటి మండలాల ఏవోలు రవికుమార్, మధుసూధనరావు, బాబ్జి, రంగారావు తదితరులు ఉన్నారు.
ఫోటో:03ఆర్‌జెయం02 రాజాం : ఆంజనేయ ట్రేడర్స్‌లో తనిఖీ చేస్తున్న అధికారులు