fertilezer
-
చలికాలంలో పిండినల్లి, చీడపీడలు : ఇవి చల్లుకుంటే చాలు
శీతాకాలం చలి వాతావరణంలో ఉష్ణోగ్రత తక్కువగా, గాలిలో తేమ ఎక్కువగా ఉంటుంది. రసం పీల్చే పురుగులు, వైరస్ తెగుళ్ల వ్యాప్తికి ఇది అనువైన కాలం. కుండీల్లో, పెరట్లో ఆకుకూరలు, టమాటా, చిక్కుడు, వంగ, మిరప, బీర, ఆనప తదితర పంటలు చీడపీడల బారిన పడకుండా చూసు కోవడానికి ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలి. చీడపీడలు రానీయని టీకాలన్నమాట. జనవరి ఆఖరులో చలి తగ్గేవరకు వీటిని పాటించాలి. జీవామృతంను 1:10 పాళ్లలో నీటిలో కలిపి ప్రతి 10–15 రోజులకోసారి క్రమం తప్పకుండా పిచికారీ చేస్తుంటే పంటలు ఆరోగ్యంగా పెరుగుతాయి. చీడపీడలను తట్టుకునే శక్తి పెరుగుతుంది.ఘా చ్ఛాదన: కుండీలు, మడుల్లో కూరగాయ మొక్కలు/చెట్ల చుట్టూ గడ్డీ గాదంతో ఐదారు అంగుళాల మందాన ఆచ్ఛాదనగా వేస్తే మంచిది. ఇంటిపంటల్లో పెద్ద పురుగులు కనిపిస్తే వాటిని చేతితో ఏరేయడం ఉత్తమం. శీతాకాలంలో పంటలనాశించే కొన్ని పురుగులుటమాటా, వంగ, ఆకుకూరలతోపాటు మందారం, చామంతి, గులాబీ వంటి పంటలపై పిండినల్లి(మీలీ బగ్), తామర పురుగు(త్రిప్స్) తరచూ కనిపిస్తుంటాయి. వీటితోపాటు పేనుబంక, దీపపు పురుగులు, తెల్లదోమ, ఎర్రనల్లి కూడా ఆశిస్తుంటాయి. పిండినల్లి: పిండినల్లి మొక్కలను ఆశించి రసం పీల్చుతుంటుంది. అందువల్ల మొక్క పెరుగుదల నిలిచిపోతుంది. ఇది సోకినప్పుడు పళ్లు తోముకునే బ్రష్‌ను ముంచి తుడిచేస్తే పోతుంది. కలబంద రసం లేదా వేపనూనె లేదా సబ్బు నీళ్లలో బ్రష్‌ను ముంచి తుడిచేయాలి. పేనుబంక: దీన్నేమసిపేను అని కూడా అంటారు. కంటికి కనిపించనంత చిన్న పేన్లు బంకవంటి తీపి పదార్థాన్ని విసర్జిస్తుంటాయి. ఈ తీపి కోసం చీమలు చేరతాయి. మొక్కల మీద చీమలు పారాడుతూ ఉంటే పేనుబంక లేదా పిండినల్లి సోకిందన్నమాటే. పచ్చదోమ: ఆకుపచ్చగా ఉండే చిన్న దోమలు ఆకుల నుంచి రసం పీల్చుతుంటాయి. పచ్చదోమ ఆకుల చివర్ల నుంచి పని మొదలు పెడతాయి. కాబట్టి ఇది సోకిన ఆకులు కొసల నుంచి లోపలి వరకు ఎండి΄ోతూ ఉంటాయి. బీర, ఆనప వంటి పెద్ద ఆకులుండే పంటలను పచ్చదోమ ఎక్కువగా ఆశిస్తూ దిగుబడిని తగ్గించేస్తాయి. తామరపురుగు: తామర పురుగు సోకిన మిరప ఆకులకు పైముడత వస్తుంది. మిరప కాయలు వంకర్లు తిరుగుతాయి. వాటిపై చారలు ఏర్పడతాయి. దీన్ని గజ్జి తెగులు, తామర తెగులు అని కూడా అంటారు. బూడిద తెగులు: చల్లని వాతావరణంలో శిలీంద్రం వేగంగా వ్యాపించడం వల్ల బూడది తెగులు వస్తుంది. ఇది సోకిన పంటల ఆకులపై తెల్లని పొడి కనిపిస్తుంది. మిరప, వంగ, టమాటా, ఆకుకూరలపై ఇది ఎక్కువగా కనిపిస్తుంటుంది. రసంపీల్చే పురుగులు: ముందుజాగ్రత్త పిచికారీలురసం పీల్చే పురుగులు పంటల జోలికి రాకుండా ముందుగానే జాగ్రత్తపడడం ఉత్తమం. వేపాకు రసం లేదా వావిలి ఆకుల కషాయం లేదా వేప నూనె లేదా వేపపిండి కషాయంను (వీటిలో ఏదైనా ఒక దాన్ని గానీ లేదా ఒక దాని తర్వాత మరొక దాన్ని మార్చి మార్చి గానీ) ప్రతి 7–10 రోజులకోసారి పిచికారీ చేయాలి. వేపాకు రసం: పావు కిలో వేపాకులు రుబ్బి + 5 లీటర్ల నీటిలో కలిపి అదే రోజు పంటలపై చల్లాలి(10 కిలోల వేపాకులు రుబ్బి 100 లీటర్ల నీటిలో కలిపి ఎకరంలో పంటలకు చల్లవచ్చు). వావిలి ఆకుల కషాయం: 2 లీటర్ల నీటిలో 350 గ్రాముల వావిలి ఆకులు వేసి 2 లేదా 3 పొంగులు వచ్చే వరకు మరిగించి.. చల్లార్చిన తర్వాత ఆ కషాయంలో 10 లీటర్ల నీటిలో కలిపి పంటలపై పిచికారీ చేయాలి(5 కిలోల వావిలి ఆకుల కషాయాన్ని 100 లీటర్ల నీటిలో కలిపితే ఎకరానికి సరిపోతుంది). వేప నూనె: మార్కెట్లో దొరుకుతుంది. సీసాపై ముద్రించిన సాంద్రతకు తగిన మోతాదులో పిచికారీ చేయాలి.వేపకాయల పిండి రసం: 10 లీటర్ల నీటిలో అర కేజీ వేపకాయల పిండి(వేపగింజల పిండి 300 గ్రాములు చాలు)ని పల్చటి గుడ్డలో మూటగట్టి.. 4 గంటలు నానబెట్టాలి. ఆ తర్వాత మూటను నీటిలో నుంచి తీసి పిండాలి. ఇలా అనేకసార్లు ముంచుతూ తీస్తూ పిండాలి. అదే రోజు పిచికారీ చేయాలి లేదా రోజ్ క్యాన్ ద్వారా మొక్కలపై చల్లవచ్చు. ఈ కషాయాలు, రసాలను పిచికారీ చేసేముందు 10 లీటర్లకు 5 గ్రాముల(100 లీటర్లకు 200 గ్రాముల) సబ్బు పొడి లేదా కుంకుడు రసాన్ని కలపాలి. నూనె పూసిన ఎరలు: నూనె పూసిన ఎరలు(స్టిక్కీ ట్రాప్స్) వేలాడదీస్తే పురుగులను ఆకర్షించి నశింపజేస్తాయి. తామర పురుగులను ఆకర్షించడానికి తెలుపు, తెల్లదోమలను నీలం, పచ్చదోమలను పసుపుపచ్చ ఎరలను వాడాలి. టమాటా, వంగ, మిర్చి వంటి ప్రతి 20 కూరగాయ మొక్కలకు ఒక్కో రకం ఎరలను రెండేసి చొప్పున వేలాడదీయాలి. ఎరలను మార్కెట్లో కొనొచ్చు. లేదా ఆయా రంగుల డబ్బాలు లేదా ΄్లాస్టిక్ షీట్లు ఉంటే వాటికి నూనె లేదా గ్రీజు రాసి వేలాడదీయవచ్చు.రసంపీల్చే పురుగుల తీవ్రత ఎక్కువగా ఉంటే?రసంపీల్చే పురుగులు ఇప్పటికే మొక్కలకు తీవ్రస్థాయిలో ఆశించి ఉంటే పైన పేర్కొన్న పిచికారీలు కొనసాగిస్తూనే.. తెల్లటి షేడ్‌నెట్‌ను మొక్కలపై గ్రీన్హౌస్ మాదిరిగా రక్షణగా ఏర్పాటు చేయాలి. ఇనుప తీగతో డోమ్ ఆకారం చేసి దానిపై తెల్లని షేడ్‌నెట్ చుట్టేస్తే సరి. – డా. గడ్డం రాజశేఖర్ సుస్థిర వ్యవసాయ కేంద్రం, సికింద్రాబాద్ -
మొక్కలు చీడపీడల్లేకుండా, పచ్చగా ఉండాలంటే, ఇవిగో చిట్కాలు!
పచ్చదనం అంటే.. ఎక్కడో పార్క్లకో, అడవులకో వెళ్లాల్సిన అవసరం లేదు. మన పెరట్లో నాలుగు మందార, గులాబీ,చేమంతి మొక్కలో ఉంటే సరిపోతుంది. ఇంటి ముందు గుబురుగా పెరిగిన తులసి మొక్క చాలు మనసు ప్రశాంతంగా ఉండటానికి. చిన్న చిన్న మొక్కలతో ఇల్లు అందంగా కనిపించడమే కాదు అనేక ఆరోగ్య ప్రయోజనాలూ ఉన్నాయి.అయితే మనకున్నచిన్న బాల్కనీలో, పెరట్లో మొక్కల్ని పెంచడం అంత ఈజీ కాదు సాధారణంగా మొక్కలను ఇష్టపడేవారు బయటి నుంచి మొక్కలు తెచ్చి తమ తోటల్లో లేదా ఇళ్లలోని కుండీల్లో నాటుతారు. మొక్కలకు సరైన జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, వాడిపోతూ ఉంటాయి. ఉన్నట్టుండి ఎండిపోతాయి. సరైనపోషణతో కీటకాల బెడద లేకుండాపచ్చగా ఎదగాలంటే ఏం చేయాలి?మొక్కలు జాగ్రత్తగా పరిశీలించకపోయినా,పోషణ అందకపోయినా, నీళ్లు ఎక్కువైనా చని పోతాయి. పురుగులు కీటకాలు మొక్కలను మాత్రమే కాకుండా కుండలోని మట్టిని కూడా దెబ్బతీస్తాయి. జాగ్రత్తలు, చిట్కాలుదెబ్బతిన్న, చనిపోయిన ఆకులని ఎప్పటికప్పుడు క్లీన్ చేయాలి. దీని వల్ల చెట్లు చక్కగా పెరుగుతుంది. కాబట్టి, వీటిని కత్తెరతో కత్తిరించడం మంచిది.మొక్కలకి నీళ్ళతో పాటు సరైన కాంతి అవసరం. మరీ ఎండలో కాకుండా సమానమైన ఎండ తగిలేలా చూసుకోవాలి. అలా అని చీకటికూడా మంచిది కాదు. కాస్తంత వెలుతురు కావాలి.మొక్కలకి ఇంట్లోనే తయారు చేసుకున్న అనేక ఎరువులు ఇస్తూ ఉండాలి. పుల్లటి మజ్జిగ ద్రావణం, బనానా పీల్ ఫెర్టిలైజర్, పంచగవ్య, ఎండిన పశువుల ఎరువు, వేపనూనె, వేపగింజలు, ఆకుల కషాయం లాంటివి మొక్క, కుండా సైజును బట్టి ఇవ్వాలి.పుల్ల మజ్జిగ ద్రావణంగ్లాసు పుల్లటి మజ్జిగలో ఐదు గ్లాసులు నీళ్లుపోసి కలపాలి. ఈ నీటిని స్ప్రే బాటిల్లో పోసి మొక్కలపై చల్లాలి. ఉదయం సాయంత్రం ఒకసారి ఈ నీటిని మొక్కలు పోయడం వల్ల చీడపీడలు పోయి మొక్కలు చక్కగా పెరుగుతాయి.పచ్చి బఠానీతో పచ్చగా... పచ్చి బఠాణి మనకు ఎంత మేలు చేస్తుందో తెలిసిందే. అయితే బఠాణి పిక్కలు తీసి తొక్కలను పారేస్తుంటాము. కానీ ఈ తొక్కలు మొక్కలకు చక్కని పోషకాలు అందిస్తాయి. అందుకే తొక్కలను మిక్సీజార్‌లో వేసి పేస్టులా చేయాలి. ఈ పేస్టులో కాసిని నీళ్లు ΄ పోసి వడగట్టాలి. ఈ నీటిని గార్డెన్‌లోని మొక్కలకు పోషకాలు ఈ నీరు మంచి బలవర్థకమైన టానిక్‌లా పనిచేసి మొక్కలు చక్కగా పెరిగేందుకు దోహదపడతాయి.తెగుళ్లు, నివారణమొక్కలు సాధారణంగా పురుగులు,తెగుళ్లు నుంచి ఎప్పటికప్పుడు వాటిని కాపాడుకోవాలి. తెల్ల నల్లి, గొంగళి లాంటి వాటిని చేతితో తీసేయవచ్చు. పసుపు, ఉప్పు, ఇంగువ నీళ్లు చల్లినా ఫలితం ఉంటుంది. ముఖ్యంగా వర్షాకాలంలో కనీసం రెండు రోజులకు ఒకసారైనా మొక్కల్ని పరికించి చూడాలి. లేదంటే గొంగళిపురుగులు, ఆకుతొలిచే పురుగులు ఆకుల్ని పూర్తిగా తినేస్తాయి. మట్టిలో తేమ కారణంగా, కొన్నిసార్లు చిన్న నత్తలు లేదా పాకే పురుగులు మొక్కలను పూర్తిగా నాశనం చేస్తాయి. వీటికి పొడి గుడ్డు పెంకు పొడి బాగా ఉపయోగపడుతుంది. గుడ్డు పెంకులను పూర్తిగా శుభ్రం చేసి, పొడి చేసి మట్టిలో కలపాలి.పువ్వులపై మైనంలాగా కనిపించే తెల్లటి మీలీ బగ్స్ (మందార, గులాబీ మొక్కలపై) వాటిని వదిలించుకోవడానికి, ఒక లీటరు నీటిలో చిటికెడు బేకింగ్ సోడా, 1 టీస్పూన్ షాంపూ, 2-3 చుక్కల వేపనూనె కలిపి మొక్కలపై చల్లుకోవాలి. టొమాటో, బెండకాయ, బీన్స్, ఓక్రా మొదలైన కొన్ని కూరగాయలపై కూడా ముందుగానే చల్లుకోవాలి. దాల్చిన చెక్క పొడికూడా బాగా పనిచేస్తుంది.ఇదీ చదవండి: వంటిట్లోని స్క్రబ్బర్, స్పాంజ్లతో ముప్పు : టాయిలెట్ కమోడ్‌కు మించి బ్యాక్టీరియా -
పూల మొక్కలకి ఈ ఎరువు ఇవ్వండి : ఇక పువ్వులే పువ్వులు!
మిద్దె తోటలు, చిన్న చిన్న బాల్కనీలోనే మొక్కల్ని పెంచడం ఇపుడు సర్వ సాధారణంగా మారింది. అయితే నర్సరీనుంచి తెచ్చినపుడు పచ్చని ఆకులు, పువ్వులతో కళ కళలాడుతూ ఉండే మొక్కలు, మనం కుండీలలోకి మార్చగానే పెద్దగా పూయవు. సరికదా ఎదుగుదల లేకుండా, ఉండిపోతాయి. ఇలా ఎందుకు ఉంటాయో తెలుసా? వాటికి సరైన పోషణ లేక పోవడమే ముఖ్య కారణం. మరి పర్యావరణానికి ఎలాంటి హాని లేకుండా, మన ఇంట్లోనే సులభంగా దొరికే వాటితో చక్కటి ఎరువును తయారు చేసుకోవచ్చు అదెలాగో చూద్దాం.ఎలాంటి మొక్క అయినా దాని సహజ లక్షణం ప్రకారం పువ్వులు పూయాలన్నా,కాయలు కాయాలన్నా తగిన ఎండ, నీటితోపాటు పోషకాలు కూడా కావాలి. పొటాషియం,ఫాస్పరస్, మెగ్నీషియం, కాల్షియం పోషకాలు మొక్కల పునరుత్పత్తి సామర్థ్యంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ సందర్భంగా అరటి తొక్కల గురించి ప్రధానంగా చెప్పుకోవాలి. అరటి తొక్కల్లో ఇవన్నీ లభిస్తాయి. బనానా పీల్ ఫెర్టిలైజర్ ద్వారా మొక్కల్లో పూలు, పండ్లు ఎక్కువగా రావడమే కాదు, పండ్ల మొక్కలకు దీన్ని ఎరువుగా వేస్తే పండ్లు రుచిగా తయారవుతాయి. తొక్కల్లోని పొటాషియం మొక్కలు వివిధ రకాల వ్యాధులతో పోరాడే శక్తిని అందిస్తుంది. View this post on Instagram A post shared by Life’s Good Kitchen (@lifesgood_kitchen)ఎలా వాడాలి? అరటి పండు తొక్కలను నేరుగా మొక్కల మధ్య మట్టిలో పాతిపెట్టవచ్చు. ఇది కొన్ని రోజులకు కుళ్లి, ఎరువుగా మారి మొక్కకు చక్కటి పోషకాన్ని అందిస్తుంది.అరటి పండు తొక్కలను వేడి నీటిలో బాగా మరిగించి,చల్లారిన తరువాత ఈ టీని కుండీకి ఒక గ్లాసు చొప్పున అందించాలి. ఇలా చేస్తు గులాబీ మొక్కలు నాలుగు రోజులకే మొగ్గలు తొడుగుతాయి.అరటి పళ్ల తొక్కలను ఒక బాటిల్‌వేసి, నీళ్లు పోసి, 24 గంటలు పులిసిన తరువాత, దీనికి కొద్దిగా నీళ్లు కలుపుకొని నేరుగా ఆ వాటర్‌ను మొక్కలకు పోయవచ్చు. లేదంటే బనానా తొక్కల్ని బాగా ఎండబెట్టి, పొడిగా చేసుకుని నిల్వ చేసుకుని కూడా వాడుకోవచ్చు.అరటి తొక్కలతో తయారు చేసిన ద్రావణం, టీ లేదా ఫెర్టిలైజర్‌ను ప్రతీ 4-6 వారాలకు మొక్కలకు ఇస్తే మంచి ఫలితం ఉంటుంది. ప్రపంచంలోనే అరటి ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న మనదేశంలో అరటిపండు వ్యర్థాలను వినియోగించుకుంటే రసాయన ఎరువులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవచ్చు. సహజమైన సూక్ష్మజీవుల చర్యలు జరిగి నేలకూడా సారవంతమవుతుంది. ఫలితంగా ఆరోగ్యకరమైన మొక్కలు ,దీర్ఘకాలిక స్థిరమైన పర్యావరణ వ్యవస్థ మన సొంతమవుతుంది. -
లైసెన్స్ ఒకరిది.. అమ్మేది ఇంకొకరు..!
సాక్షి, మంచిర్యాల: వారు ఇచ్చిందే విత్తనం.. వారు ఇచ్చినవే ఎరువులు, మందులు ఇదీ జిల్లాలోని ఫర్టిలైజర్ దుకాణాల్లో పరిస్థితి. జిల్లాలో 80శాతం ఫర్టిలైజర్ దుకాణాలను లైసెన్స్ పొందిన వ్యక్తులు కాకుండా వేరేవాళ్లు నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. కనీస అర్హత లేకపోయినా.. ఎరువుల శాస్త్రీయ నామాలు తెలియకున్నా.. ప్రమాణాలు పాటించకుండా ఇష్టానుసారంగా రైతులకు విక్రయిస్తున్నారు. పట్టణాలతోపాటు గ్రామాల్లోనూ విరివిగా ఫర్టిలైజర్ దుకాణాలు వెలుస్తున్నాయి. డిగ్రీ అర్హత, బీఎస్సీ అగ్రికల్చర్ రసాయన శాస్త్రం అర్హత సాధించిన వారికి ఫర్టిలైజర్ దుకాణం లైసెన్స్ ఇస్తారు. డిగ్రీ ద్వారా లైసెన్స్ పొందితే డీలర్‌గా ఎరువులు, విత్తనాలు, ఇతర రసాయన మందుల దుకాణాల నిర్వహణకు అవకాశం ఉంటుంది. రసాయన మందులు అమ్మాలంటే తప్పనిసరిగా ఎవరి సర్టిఫికెట్ ద్వారా లైసెన్స్ పొందారో వారిని టెక్నికల్ పర్సన్స్‌గా దుకాణంలో ఉంచాల్సి ఉంటుంది. దుకాణాల తనిఖీ సమయంలో టెక్నికల్ పర్సన్ లేకుండా విక్రయాలు జరిపితే 6ఏ యాక్టు కింద కేసు నమోదు చేయవచ్చు. 80 నుంచి 90 శాతం దుకాణాల్లో టెక్నికల్ పర్సన్ లేకుండానే విక్రయాలు సాగుతున్నట్లు తెలుస్తోంది. సర్టిఫికెట్ కలిగిన వ్యక్తులు ఎక్కడో ఉంటారు. ఇక్కడ కనీసం పదో తరగతి పాస్ కాని వారు కూడా దుకాణాలు నిర్వహిస్తున్నారనే ఆరోపణలున్నాయి. దీంతో ఆయా కంపెనీల సేల్స్ మేనేజర్లు, సిబ్బంది చెప్పిన రసాయన మందులు రైతులకు అంటగడుతుంటారు. పంటలపై మందుల ప్రభావం ఏ విధంగా ఉంటుంది.. ఎలాంటి వాతావరణం.. నేలలో పిచికారీ ప్రభావం తదితర అంశాలపై అవగాహన ఉండడం లేదు. వ్యవసాయ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడంతో దుకాణదారులకు అడ్డులేకుండా పోతోంది. అవగాహన, శిక్షణ కరువు.. జిల్లాలో 320 ఫర్టిలైజర్, విత్తన దుకాణాలు ఉన్నాయి. గతంలో ఉమ్మడి జిల్లాలో ఉన్నవారి పేరిట, డిగ్రీ అర్హత కలిగిన సర్టిఫికెట్ల పేరిట లైసెన్స్‌లు పొంది మంచిర్యాల జిల్లాలో నిర్వహిస్తున్నారు. ప్రస్తుత జిల్లాలో వారు లేకపోయినా వారి సర్టిఫికెట్లతో దుకాణాల లైసెన్స్‌లు కొనసాగుతున్నాయి. వాటిని రద్దు చేసే అవకాశం లేదని వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు. కానీ టెక్నికల్ పర్సన్ లేకుండా, అర్హులైన వ్యక్తులు లేకుండా దుకాణాలు నిర్వహించరాదు. దీంతోపాటు ప్రతీ డీలర్‌కు డిప్లామా ఇన్ అగ్రికల్చర్ టూర్ ఎక్స్టెన్షన్ సర్వీస్ ఆఫ్ ఇన్‌ఫుట్(డీఏఈఎస్ఐ) కింద శాస్త్రవేత్తలు, రిటైర్డు వ్యవసాయ అధికారుల ద్వారా 48 రోజులపాటు శిక్షణ తరగతులు నిర్వహిస్తారు. అనంతరం పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తే సర్టిఫికేట్ అందజేస్తారు. ఈ శిక్షణ తరగతులు నామమాత్రం కాగా.. కొందరు “మామూలు’గానే సర్టిఫికేట్ పొందుతున్నట్లు తెలుస్తోంది. శిక్షణకు హాజరైన వారికి రూ.10వేలు, సర్టిఫికేట్ పొందడానికి మరో రూ.10వేలు తీసుకుంటున్నట్లు డీలర్లు చర్చించుకుంటున్నారు. వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలతో ఫెస్టిసైడ్స్‌పై అవగాహన సదస్సులు లేక రసాయనిక శాస్త్రీయ నామాలు, దాని ప్రభావం, వినియోగం తెలియకపోయినా విక్రయాలు సాగిస్తున్నారు. దుకాణాల ముందు విత్తన, ఎరువుల తదితర స్టాక్ బోర్డులు ఏర్పాటు చేయడం లేదు. రైతులు కొనుగోలు చేసిన విత్తనం, ఎరువు, రసాయన మందుల తాలుకు సరైన రశీదు ఇవ్వడం లేదు. తెల్లకాగితంపై రైతు పేరు, పేరు కొనుగోలు చేసిన తేదీ, ధర వేసి ఇస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఏ మందు అమ్మినా తయారీ, ఎక్స్పైరీ తేదీ, కంపెనీ, బ్యాడ్జి నెంబర్ తదితర వివరాలతో డీలర్ పేరుతో ఉన్న రశీదు అందించాల్సి ఉంటుంది. అమాయక రైతులను ఆసరాగా చేసుకొని ఇష్టానుసారం కంపెనీల ఆఫర్లకు ఆశపడి కట్టడబెతున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. 90 శాతం మందికి శిక్షణ ఉమ్మడి జిల్లాలో గతంలో లైసెన్స్ పొందిన వారే ఎక్కువగా ఉన్నారు. డీఏఈఎస్ఐ 90 శాతం మంది డీలర్లు ట్రైనింగ్ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. డీలర్లతో సమావేశాలు నిర్వహిస్తున్నాం. ఇష్టానుసారం అమ్మకానికి వీలు లేదు. నిబంధనలకు విరుద్ధంగా విక్రయాలు సాగిస్తే చర్యలు తీసుకోవడం జరుగుతుంది. – వీరయ్య, జిల్లా వ్యవసాయ అధికారి -
భారీగా పెరిగిన డీఏపీ ధరలు..
సాక్షి, హైదరాబాద్: ఎరువుల ధరలను ఇఫ్కో కంపెనీ భారీగా పెంచింది. 50 కేజీల డీఏపీ బస్తా ధర ఇదివరకు రూ. 1,200 ఉండగా... దాన్ని ఏకంగా రూ.1,900 చేయడం గమనార్హం. అంటే ఒక బస్తాపై రూ.700 పెంచింది. ఈ ధరలు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచే అమలులోకి వచ్చాయని ఇఫ్కో తెలిపింది. అలాగే కాంప్లెక్స్ ఎరువుల ధరలు కూడా ఒక్కో బ్యాగుపై రూ. 425 నుంచి రూ. 615 వరకు పెరిగాయి. పాత స్టాకును పాత ధరకే విక్రయించాలని, కొత్త సరుకుకు మాత్రమే పెరిగిన ధరలు వసూలు చేయాలని ఇఫ్కో తెలిపింది. అయితే ఇప్పుడు పాత స్టాకే అందుబాటులో ఉందని, ఇంకా కొత్త స్టాక్ మొదలు కాలేదని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. ఇప్పటికే సాగు ఖర్చులు పెరుగుతూ అనేక రకాలుగా అన్నదాతలపై భారం పడుతుండగా ఎరువుల ధర భారీగా పెరగడం మరింత ఆందోళన కలిగిస్తోంది. పైగా మన రాష్ట్రంలో రైతులు మోతాదుకు మించి ఎరువులు వాడుతున్నారు. రాష్ట్రంలో రెండు సీజన్లలో 14 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు రైతులు వాడుతున్నారు. అయితే వేయాల్సిన దానికంటే ఎక్కువగా వేస్తున్నారు. ఇది కూడా అన్నదాతపై ఆర్థిక భారాన్ని మోపుతోంది. దేశంలో సగటున ఎకరానికి 51.2 కిలోల ఎరువులు వాడితే, రాష్ట్రంలో ఎకరానికి 185 కిలోల ఎరువులు రైతులు వేస్తున్నట్లు వ్యవసాయ శాఖ తెలిపింది. అంటే ఒక బస్తా ఎరువులు వేయాల్సిన చోట మరో రెండు, మూడు బస్తాలు ఎక్కువ వేస్తున్నారు. దేశంలో యూరియా ధరలపై కేంద్రం నియంత్రణ ఉంది. ధరల్లో ఏమైనా హెచ్చుతగ్గులు ఉన్నా సబ్సిడీ రూపంలో కేంద్ర ప్రభుత్వమే భరిస్తోంది. కానీ మిగతా ఎరువుల విషయానికొస్తే మాత్రం కంపెనీలు ఇష్టారాజ్యంగా పెంచుతున్నాయి. ఏమైనా అంటే ముడిసరకుల ధరల పెరుగుదలను కారణంగా చూపుతున్నారు. డీఏపీ, కాంప్లెక్స్ ఎరువులకు సంబంధించిన ముడిసరకును ఎక్కువగా విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ఇందులో ప్రధానంగా ఫాస్పరిక్ ఆమ్లం ధర పెరగడంతో ఎరువుల ధర భారీగా పెంచాల్సి వస్తోందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో రేట్లు పెరగడంతో తాము అనివార్యంగా రైతులపైనే భారం వేయాల్సి వస్తోందంటున్నారు. కాగా ఇతర కంపెనీలు కూడా ధరలను పెంచాలని నెలన్నర క్రితం నిర్ణయించిన సంగతి తెలిసిందే. చదవండి: కరోనా కట్టడిపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం..! -
రైతుల సేవే లక్ష్యం: సీఎం జగన్
ఆర్బీకేల్లోని అగ్రికల్చర్ అసిస్టెంట్లు ఈ– క్రాపింగ్ చేస్తున్నారు. రైతులకు మద్దతు ధర లభిం చకపోతే వీరికి చెబితే రిజిస్టర్ చేసుకుం టారు. సీఎం యాప్ ద్వారా ఆ విషయాన్ని వారు పైకి తెలియజేస్తారు. తద్వారా మార్కెటింగ్ శాఖ జోక్యం చేసుకుని, మద్దతు ధరకు అమ్మించే ప్రయత్నం చేస్తుంది. ఒకవేళ అలా వీలుకాకపోతే నేరుగా మార్కెటింగ్ శాఖే కొనుగోలు చేస్తుంది. ఇదంతా జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో జరుగుతుంది. –సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: రైతును ఊరు దాటించే పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత రైతు భరోసా కేంద్రాలకు (ఆర్బీకేలకు) ఉం దని, ఆ మేరకు అవసరమయ్యే సేవలన్నింటినీ అందించాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. రైతుల అవసరాలు అన్నింటినీ తీర్చడమే లక్ష్యంగా ఆర్బీకేలు పని చేయాలని, వీటి ద్వారా రైతులు ఆర్డర్ చేసిన వెంటనే నిర్దేశిత సమయంలోగా విత్తనాలు, ఎరువులు చేరాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రస్తుత రబీ ప్రొక్యూర్‌మెంట్‌తో పాటు, ఖరీఫ్ 2021–22 సన్నద్ధతపై గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎట్టి పరిస్థితుల్లోనూ రైతు ఊరు దాటి పోకూడని విధంగా సేవలందించాలనే విషయాన్ని అధికారులు కచ్చితంగా దృష్టిలో పెట్టుకోవాలన్నారు. ప్రతి గ్రామానికి ఆర్బీకే యూనిట్‌గా పంటల ప్రణాళిక తయారు చేయాలన్నారు. ఆర్బీకేల్లో ప్రతి రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు స్పందన కార్యక్రమం నిర్వహించాలని చెప్పారు. ఈ సమయంలో వ్యవసాయ సిబ్బంది ఆర్బీకేలోనే రైతులకు అందుబాటులో ఉండాలన్నారు. ఆర్బీకేల ద్వారా కచ్చితంగా నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందివ్వాలని, ఇందులో వేరే మాటకే తావులేదని.. ఫిషరీస్ ఫీడ్, లైవ్ స్టాక్ మెడిసిన్, సీడ్, ఫెర్టిలైజర్స్ అన్నీ రైతులకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఆర్బీకేలన్నింటికీ ఇంటర్నెట్ సదుపాయం ఆర్బీకేలన్నింటికీ వేగవంతమైన ఇంటర్నెట్ సదుపాయం ఉండాలని సీఎం ఆదేశించారు. ఇది ఇంటరాక్టివ్ విధానంలో రైతుల సందేహాల నివృత్తికి ఉపయోగపడుతుందన్నారు. రైతులకు వచ్చే ఖరీఫ్‌లో ఇచ్చే విత్తనాలు కచ్చితంగా నాణ్యతతో ఉండాలని.. మార్కెట్లో కొనుగోలుకు ఆసక్తి చూపని వంగడాలు, ఆసక్తి చూపి మంచి ధర లభించే వంగడాలపై రైతులకు అవగాహన కల్పించాలని చెప్పారు. దీనిపై పోస్టర్లను విడుదల చేయాలన్నారు. దీనివల్ల మార్కెటింగ్ సౌకర్యాలు మరింత మెరుగు పడతాయన్నారు. అగ్రికల్చర్ అసిస్టెంట్ సహాయంతో రైతులకు స్పష్టంగా ఈ విషయాలను తెలియజేయాలని, ఆన్లైన్లో కూడా అప్లోడ్ చేయాలని సూచించారు. రబీ పంటలు సాగు చేసిన 6,081 ఆర్బీకేల పరిధిలో పంటల కొనుగోళ్లు ప్రారంభించినట్లు అధికారులు సీఎంకు తెలిపారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు రూ.28,430 కోట్లతో పంటల కొనుగోళ్లు చేశామని తెలిపారు. ఇందులో ధాన్యం కొనుగోలుకు రూ.22,918 కోట్లు, ఇతర పంటలకు రూ.5,512 కోట్లు వెచ్చించామన్నారు. 2015–16 నుంచి 2018–19 వరకు గత ప్రభుత్వం నాలుగేళ్లలో పంటల కొనుగోలు కోసం రూ.43,047 కోట్లు మాత్రమే వెచ్చించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ సమీక్షలో వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీయస్ నాగిరెడ్డి, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. విత్తనాల దగ్గర నుంచి పురుగు మందులు, ఎరువులు సహా ఏం కొనుగోలు చేసినా రైతు మోసపోకూడదు. వాటి కోసం ఆర్బీకేల్లో రైతులు ఆర్డర్ చేసిన 48 నుంచి 72 గంటల్లోగా అందుబాటులోకి తేవడమే లక్ష్యం. వాటిని ప్రభుత్వం పరీక్షించి, క్వాలిటీ పరంగా స్టాంప్ వేసి ఇచ్చే పరిస్థితి కనిపిస్తుంది. తద్వారా కల్తీ అన్నది రైతు దగ్గరకి రాకూడదన్న తాపత్రయంతో అడుగులు ముందుకు వేస్తున్నాం. ఆర్బీకే యూనిట్‌గా ప్రతి గ్రామానికి పంటల ప్రణాళిక తయారు చేయాలి. ఏయే పంటలకు కనీస మద్దతు ధర ఏమిటనేది ప్రదర్శించిన పోస్టర్ ఉండాలి. ప్రతి గ్రామంలో రైతులు విత్తనం వేసే దగ్గర నుంచి పంట అమ్ముకునేంత వరకు ప్రతి అడుగులో తోడుగా ఉంటూ చేయి పట్టుకుని నడిపించాలి. ఇలాంటి వ్యవస్థ కచ్చితంగా గ్రామాల్లో రావాలనే తాపత్రయం, తపన నుంచి పుట్టిన బీజమే ఈ రైతు భరోసా కేంద్రం. ఆర్బీకే చానల్ ప్రారంభం రైతులకు అన్ని విధాలా తోడుగా ఉండేలా రూపొందించిన ఆర్బీకే చానల్‌ను సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకేల) ఘట్టంలో ఈ రోజు ఇంకో ముందడుగు వేశామని పేర్కొన్నారు. ఆర్బీకేల్లో స్మార్ట్ టీవీలు పెడుతున్నాం కాబట్టి, అక్కడి రైతులకు చాలా విషయాల మీద తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాతావరణం గురించి తెలియజెపుతూ నిరంతరం సమాచారం ఇచ్చేందుకు ఈ చానల్ ఉపయోగపడుతుందన్నారు. ఏ రైతుకు ఏ సందేహం వచ్చినా టోల్ ఫ్రీ నంబర్ 155251కు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చని చెప్పారు. రైతుల సందేహాలపై సైంటిస్ట్‌లతో ఇంటరాక్టివ్ పద్ధతిలో కూడా సందేహాలు తీర్చడానికి ఒక పటిష్ట వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రాబోయే రోజుల్లో ఆర్బీకేలను విప్లవాత్మకంగా రైతులకు ఇంకా దగ్గరగా, ఇంకా ఎక్కువగా ఉపయోగపడే విధంగా తీసుకొచ్చే ప్రక్రియలో భాగంగా అడుగులు ముందుకు వేస్తున్నామని తెలిపారు. ఇవన్నీ కూడా రైతులకు ఉపయోగపడాలని మనసారా ఆశిస్తున్నానని, రైతులకు ఇంకా మంచి చేసే పరిస్థితి రావాలని ఆకాంక్షించారు. చదవండి: బడుగుబలహీన వర్గాలకే అగ్రాసనం.. మైదుకూరు ఛైర్మన్ పీఠం వైఎస్సార్సీపీదే -
మద్దతు మాటే మరిచారు
భూమి మనదే... కష్టం మనదే... దానిపై పండే పంటకు మద్దతుధర మాత్రం మనది కాదు. ఎక్కడో నాలుగు గోడల మధ్య అధికారులే నిర్ణయిస్తారు. అదైనా క్షేత్రస్థాయిలో అమలవుతుందా అంటే దానికీ లేనిపోని సాంకేతిక కారణాలు చూపి వర్తింపజేయట్లేదు. ఏటా సాగు వ్యయం పెరుగుతోంది. ఎరువులు... విత్తనాలు... పురుగుమందుల ధరలతోపాటు కూలిమొత్తాలూ పెరుగుతున్నాయి. కానీ పండించిన పంటకు ఆ స్థాయిలో ధర నిర్థారించకపోవడమే ఇక్కడున్న సమస్య. ఫలితం ఏటా రైతాంగం అప్పుల్లో కూరుకుపోతోంది. వారి కష్టం మట్టిపాలవుతోంది. గరుగుబిల్లి(కురుపాం): దేశానికి రైతే వెన్నెముక అంటారు. వారిని ఆదుకోవడమే తమ ప్రధాన కర్తవ్యం అంటారు. కానీ వారు పండించే పంటకు గిట్టుబాటు ధర కల్పించరు. ప్రకృతి విపత్తులవల్లో... మరే కారణాలవల్లో పంట నష్టపోతే కనీసం పరిహారం న్యాయబద్ధంగా అందించరు. అలా రైతు వెన్ను విరిచేస్తున్నారు. ఆరుగాలం కష్టించి... ఎన్నో సమస్యలకు ఎదురీది... ఎలాగోలా పండించిన పంటకు మద్దతు ధర పెంచాలని వేడుకుంటున్నా సర్కారు మా త్రం చేతులు విదల్చడం లేదు. ఈ ఏడాదైనా మద్దతుధర పెరుగుతుందని ఆశగా ఎదురుచూసే అన్నదాతకు తీవ్ర నిరాశే మిగిలింది. క్వింటాలుకు రూ.200లు మాత్రమే పెంచి చేతులు దులుపు కున్నారు. అమలు కాని ఎన్నికల హామీలు 2014 ఎన్నికల్లో రైతులు పండించే పంట ఉత్పత్తి వ్యయంపై 50 శాతం అదనంగా చెల్లిస్తామని తెలు గుదేశం నాయకులు హామీలు గుప్పించారు. వరి పంట ఉత్పత్తి చేసేందుకు క్వింటాలుకు రూ.2వేల వరకు వ్యయం అవుతుందని ప్రభుత్వం చెబుతున్న లెక్క. కానీ ప్రభుత్వమే కేవలం రూ.1,770లుగా మద్దతు ధర నిర్ణయించి విశేషం. ప్రభుత్వ లెక్కల ప్రకారం చూసినా రైతుకు క్వింటాలుకు రూ.300వరకు నష్టం వస్తోంది. ఉత్పత్తి వ్యయంకన్నా 50 శాతం పెంచడం అటుంచితే పెట్టిన వ్యయం కూడా తిరిగిరాని పరిస్థితి నెలకొంది. వరికి కనీస మద్దతుధర క్వింటాలుకు రూ.2,800లు ఉంచాలని ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నా పట్టించుకోనే నాథుడే కరువయ్యారు. ’రైతులను పట్టించుకోని ప్రభుత్వం ధాన్యం మద్దతు« ధరన పెంచాలని రైతులు, సంఘాలుచేసిన పోరాటాలు ప్రభుతాన్ని కదిలించలేకపోతున్నాయి. కంటితుడుపుగా మద్దతు ధరను ప్రకటించి ప్రభుత్వాలు మమ అనిపించాయి. ఎరువుల ధరలను పెంచిన ప్రభుత్వం కనీస మద్దతు ధర పెంచకపోవడం అన్యాయమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూలీల ధరలు రెట్టింపు అవడంతో పెట్టుబడులకోసం అధిక వడ్డీలకు అప్పుచేయాల్సి వస్తోంది. ఇంత జరిగినా ప్రకృతి సహకరించకపోతే ఆశించిన దిగుబడి కూడా రావడం లేదు. తీరా వచ్చిన పంటను సైతం గిట్టుబాటు ధరకు అమ్ముకోలేకపోతున్నారు. దళారీల దందా ప్రభుత్వం తరఫున సకాలంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో ఆర్థిక అవసరాల నిమిత్తం రైతులు ముందుగా కళ్లాల్లో వాలిపోతున్న ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకుంటున్నారు. వారు ప్రభుత్వ ధరతో నిమిత్తం లేకుండా వారు తమ ఇష్టానుసారం రేటు నిర్ణయించి రైతాంగాన్ని దోచుకుంటున్నారు. పల్లెల్లో సాగుతున్న ఈ దందాను అడ్డుకోవడంలో అధికారులు విఫలమవుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఇక సాగు చేయడమంటేనే భయంగా మారి సాగుకు విరామం ప్రకటించాల్సి వస్తుందేమోనన్న ఆందోళన సర్వత్రా వినిపిస్తోంది. రైతు వ్యతిరేక ప్రభుత్వాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేకులుగా ముద్రవేసుకున్నాయి. ఇన్నేళ్లలో ఏ ప్రభుత్వం కూడా రైతుల కష్టాలను పట్టించుకున్న పాపాన పోలేదు. వరికి కనీసం రూ.2,500 మద్దతు ధరవుంటే రైతుకు నష్టాలు తగ్గుతాయి. ప్రభుత్వాలు రైతులపై చిన్నచూపు వల్ల తీరని అన్యాయం చేస్తున్నాయి. – గొట్టాపు త్రినాథస్వామి, కొత్తపల్లి, గరుగుబిల్లి మండలం కార్పొరేట్లకే రాయితీలు ఏటా లాభనష్టాలను ఆలోచించకుం డా సాగుచేస్తున్న అన్నదాతలకు వివిధ రకాల సాకులు చూపి కనీస మద్దతు ధర కల్పించని కేంద్రం బ డా పారిశ్రామిక వేత్తలకు, కార్పొరేట్లకు రకరకాల రాయితీలు కల్పిస్తోంది. కేవలం రైతుల విషయానికి వచ్చేసరికే ఆర్థిక సంక్లిష్టతలను చూపి గొంతు నొక్కేస్తోంది. ప్రభుత్వాలు రైతుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నాయి. – కె.రవీంద్ర, సీపీఎం నాయకుడు, గరుగుబిల్లి -
బాలాజీలో రూ.3.6లక్షల సరుకుల సీజ్
రాజాం రూరల్ : నియోజకవర్గంలోని ఎరువుల దుకాణాలపై జిల్లా ప్రత్యేక స్క్వాడ్ బృందం బుధవారం ఆకస్మిక దాడులు చేసింది. స్పెషల్ ఆఫీసర్ జి.కళ్యాణకుమార్, ప్రదీప్‌కుమార్ ఆధ్వర్యంలో సిబ్బంది వంగరలో 2, రేగిడిలో 2, రాజాంలో 2 దుకాణాలను తనిఖీ చేశారు. రాజాం పట్టణంలోని బాలాజీ ట్రేడర్స్‌లో ఓ ఫారం లేకుండా విక్రయిస్తున్న సుమారు రూ.3.6లక్షల విలువ గల ఎరువులను సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్రమంగా స్టాక్ నిల్వ ఉన్నా, స్టాక్ బోర్డులో తేడా ఉన్నా, ధరల పట్టిక బహిర్గత పర్చకపోయినా, వినియోగదారులను మోసం చేసినా సంబంధిత యజమానులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అయన వెంట రాజాం, రేగిడి, వంగర, సంతకవిటి మండలాల ఏవోలు రవికుమార్, మధుసూధనరావు, బాబ్జి, రంగారావు తదితరులు ఉన్నారు. ఫోటో:03ఆర్‌జెయం02 రాజాం : ఆంజనేయ ట్రేడర్స్‌లో తనిఖీ చేస్తున్న అధికారులు