ఆర్థిక అక్షరాస్యత అవసరం | financial literacy must | Sakshi
Sakshi News home page

ఆర్థిక అక్షరాస్యత అవసరం

Published Wed, Oct 19 2016 1:51 AM | Last Updated on Wed, Apr 3 2019 8:09 PM

financial literacy must

తాడేపల్లిగూడెం (తాలూకా ఆఫీస్‌ సెంటర్‌): ప్రతి ఒక్కరికి ఆర్థిక అక్షరాస్యత అవసరమని నాబార్డ్‌ డీడీఎం రాంప్రభు అన్నారు. మంగళవారం స్థానిక చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌లో లీడ్‌ బ్యాంక్‌ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి బ్యాంకర్ల ఆర్థిక సమావేశం, ప్రత్యేక మేళా నిర్వహించారు. ఖాతాలకు ఆధార్, మొబైల్‌ నంబర్ల అనుసంధానం, రూపే కార్డుల పంపకం, వినియోగంలోకి తేవడం, బ్యాంకు మిత్రలకు అవగాహన, కేంద్ర ప్రభుత్వ పథకాలపై ఖాతాదారులకు అవగాహన కల్పించారు.  పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని రాంప్రభు బ్యాంకర్లకు సూచించారు. జిల్లాలో ఆరు ఆర్థిక అక్షరాస్యత కేంద్రాలు ఏర్పాటుచేశామని చెప్పారు.  నాబార్డ్, డీసీసీబీ, చైతన్య గోదావరి బ్యాంక్‌ల సహకారంతో సెంటర్‌లు నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ బ్యాంకుల ప్రతినిధులు హాజరయ్యారు. లీడ్‌ బ్యాంక్‌ జిల్లా మేనేజర్‌ ఎం.సుబ్రహ్మణేశ్వరరావు, మునిసిపల్‌ కమిషనర్‌ నిమ్మగడ్డ బాలాజీ, అసిస్టెంట్‌ కమిషనర్‌ బీహెచ్‌ సంగీతరావు, ఆంధ్రా బ్యాంక్‌ ఛీప్‌ మేనేజర్‌ ప్రసాద్, యూనియన్‌ బ్యాంక్‌ మేనేజర్‌ రామలింగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement