డెక్కన్ కెమికల్స్‌లో భారీ అగ్నిప్రమాదం | Fire Accident in Vizag Chemical factory | Sakshi
Sakshi News home page

డెక్కన్ కెమికల్స్‌లో భారీ అగ్నిప్రమాదం

Published Mon, Jan 25 2016 3:37 AM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM

డెక్కన్ కెమికల్స్‌లో భారీ అగ్నిప్రమాదం - Sakshi

డెక్కన్ కెమికల్స్‌లో భారీ అగ్నిప్రమాదం

పాయకరావుపేట:  విశాఖ జిల్లా పాయకరావుపేట మండలం కేశవరంలోని డెక్కన్ ఫైన్ కెమికల్స్ కంపెనీలో ఆదివారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. కంపెనీలో రసాయనాలను నిల్వ చేసే కోల్డ్ స్టోరేజీ ప్లాంట్‌లో షార్ట్ సర్క్యూ ట్ కారణంగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే కంపెనీ అంతటా వ్యాపించాయి. ఈ ఘటనలో అదృష్టవశాత్తు ప్రాణనష్టం ఏమీ లేకపోయినప్పటికీ భారీగా ఆస్తి నష్టం సంభవించింది. ఒక కార్మికుడు అస్వస్థతకు గురయ్యాడు. రసాయనాలను నిల్వచేసే గోదాము పూర్తిగా దగ్ధమైంది. ఆస్తి నష్టం రూ.50 కోట్లకుపైగా ఉంటుందని అంచనా.

 రంగంలోకి దిగిన అగ్నిమాపక యంత్రాలు: కార్మికులు విధులు ముగించుకొనే సమయం కావడం, మంటలు చెలరేగిన ప్లాంట్‌లో ఎవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. ఈ సమయంలో స్టోర్ సీనియర్ అసిస్టెంట్‌గా ఉన్న పాకలపాటి నర్సింహరాజు అనే కార్మికుడు రసాయలనాల నుంచి వెలువడిన పొగ పీల్చడంతో అస్వస్థతకు లోనయ్యాడు. ఆయనను వెంటనే తునిలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అగ్నిమాపక యంత్రాలు వచ్చి మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. అగ్నిప్రమాదం జరిగిన ప్లాంట్‌కు పక్కన ఉన్న బ్లాకులకు మంటలు వ్యాపించకుండా సిబ్బంది చర్యలు చేపట్టారు. ప్లాంట్ నుంచి మంటలు పెద్దఎత్తున ఎగిసి పడడంతో దట్టమైన పొగ ఆవరించి చుట్టుపక్కల 5 కిలోమీటర్ల దూరం వరకు వ్యాపించింది. దీంతో భయాందోళనకు గురైన ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement