Deccan Chemical factory
-
డెక్కన్ కెమికల్స్ వద్ద ఉద్రిక్తత
-
డెక్కన్ కెమికల్స్ వద్ద ఉద్రిక్తత
పాయకరావుపేట: ఫ్యాక్టరీలో తరచూ జరుగుతున్న ప్రమాదాలను అరికట్టాలని.. వెంటనే భద్రతా చర్యలు తీసుకోకుంటే మూసివేయిస్తామని హెచ్చరిస్తూ ప్రజలు భారీ ఎత్తున ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. వివరాలివీ...విశాఖ జిల్లా పాయకరావుపేట వద్ద పట్టణ సమీపంలో డెక్కన్ కెమికల్స్ ఫ్యాక్టరీ ఉంది. దీనిలో ఆదివారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో ఫ్యాక్టరీలో రక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ కేతవరం, రాజానగరం, గజపతి నగరం, వెంకటనగరం, రాజవరం గ్రామాలకు చెందిన దాదాపు వెయ్యి మంది ప్రజలు కర్మాగారం ప్రధాన గేట్ వద్ద బైఠాయించారు. ఫ్యాక్టరీ చైర్మన్, ఎండీ వచ్చి తమకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కంపెనీలోకి చొచ్చుకుపోయి ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. వారిని అదుపు చేయటానికి పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. -
డెక్కన్ కెమికల్స్‌లో భారీ అగ్నిప్రమాదం
పాయకరావుపేట: విశాఖ జిల్లా పాయకరావుపేట మండలం కేశవరంలోని డెక్కన్ ఫైన్ కెమికల్స్ కంపెనీలో ఆదివారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. కంపెనీలో రసాయనాలను నిల్వ చేసే కోల్డ్ స్టోరేజీ ప్లాంట్‌లో షార్ట్ సర్క్యూ ట్ కారణంగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే కంపెనీ అంతటా వ్యాపించాయి. ఈ ఘటనలో అదృష్టవశాత్తు ప్రాణనష్టం ఏమీ లేకపోయినప్పటికీ భారీగా ఆస్తి నష్టం సంభవించింది. ఒక కార్మికుడు అస్వస్థతకు గురయ్యాడు. రసాయనాలను నిల్వచేసే గోదాము పూర్తిగా దగ్ధమైంది. ఆస్తి నష్టం రూ.50 కోట్లకుపైగా ఉంటుందని అంచనా. రంగంలోకి దిగిన అగ్నిమాపక యంత్రాలు: కార్మికులు విధులు ముగించుకొనే సమయం కావడం, మంటలు చెలరేగిన ప్లాంట్‌లో ఎవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. ఈ సమయంలో స్టోర్ సీనియర్ అసిస్టెంట్‌గా ఉన్న పాకలపాటి నర్సింహరాజు అనే కార్మికుడు రసాయలనాల నుంచి వెలువడిన పొగ పీల్చడంతో అస్వస్థతకు లోనయ్యాడు. ఆయనను వెంటనే తునిలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అగ్నిమాపక యంత్రాలు వచ్చి మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. అగ్నిప్రమాదం జరిగిన ప్లాంట్‌కు పక్కన ఉన్న బ్లాకులకు మంటలు వ్యాపించకుండా సిబ్బంది చర్యలు చేపట్టారు. ప్లాంట్ నుంచి మంటలు పెద్దఎత్తున ఎగిసి పడడంతో దట్టమైన పొగ ఆవరించి చుట్టుపక్కల 5 కిలోమీటర్ల దూరం వరకు వ్యాపించింది. దీంతో భయాందోళనకు గురైన ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. -
విశాఖ కెమికల్స్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు