వరి కుప్పలకు నిప్పు | fire accident Rs.70 lakshs loss | Sakshi
Sakshi News home page

వరి కుప్పలకు నిప్పు

Published Sat, Dec 24 2016 11:11 PM | Last Updated on Wed, Sep 5 2018 9:47 PM

fire accident Rs.70 lakshs loss

  • రూ.70 లక్షల పంట నష్టం
  • రాపాక (సీతానగరం) : 
    రఘుదేవపురం పంచాయతీలోని రాపాక–నల్గొండ రోడ్డులో ఉన్న పొలాల్లో 50కి పైగా వరికుప్పలకు దుండగులు శనివారం రాత్రి నిప్పుపెట్టారు. 140 ఎకరాలకు చెందిన ఈ వరి కుప్పలు పూర్తిగా దగ్ధమయ్యాయి.  సమాచారం అందుకున్న ఎస్సై వెంకటేశ్వరరావు, ఏఎస్సై మావుళ్లు అక్కడకు చేరుకున్నారు. ఈ వరికుప్పలను ఏప్రిల్‌లో నూర్పుడు చేసి, ధాన్యాన్ని అమ్మకాలకు పెట్టాలని రైతులు యోచిస్తున్నారు. ఎకరం దిగుబడికి 40 కాటాలు వచ్చినా, 5 వేలకు పైగా కాటాల దిగుబడి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న ధరతో సుమారు రూ.70 లక్షలకు పైగా నష్టం ఉంటుందని అంచనా వేస్తున్నారు. రాజమహేంద్రవరం అగ్నిమాపక సిబ్బంది చేరుకున్నప్పటికీ, సంఘటన స్థలానికి వెళ్లేందుకు ఇబ్బందులు ఎదురయ్యాయి. రెండేళ్ల క్రితం ఓ వ్యక్తి ఇలాగే వరికుప్పలకు నిప్పు పెట్టాడని రైతులు పేర్కొన్నారు. ఇప్పుడు కూడా ఆ వ్యక్తే వరికుప్పలకు నిప్పు పెట్టి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.+
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement